‘జమ్మూ-కశ్మీర్‌కు ఎవరూ వెళ్లకండి’ | USA Advice To Citizens Not To Visit Jammu And Kashmir | Sakshi
Sakshi News home page

జమ్మూ- కశ్మీర్‌కు వెళ్లకండి: అమెరికా

Published Sat, Mar 9 2019 2:57 PM | Last Updated on Sat, Mar 9 2019 2:57 PM

USA Advice To Citizens Not To Visit Jammu And Kashmir - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా పౌరులెవరూ జమ్మూ-కశ్మీర్‌ పర్యటనకు వెళ్లవద్దని అమెరికా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు అమెరికా ట్రావెల్‌ అడ్వైజరీ స్థానిక ప్రజలకు పలు సూచనలు చేసింది. పుల్వామా ఉగ్రదాడి, బాల్‌కోట్‌లో ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దాడి అనంతరం భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య యుద్ద వాతావరణం అలుముకుందని వివరించింది. దీంతో ఈ ప్రభావం జమ్మూ-కశ్మీర్‌లో ఎక్కువగా ఉందని.. ఇప్పట్లో శాంతియుతమైన పరిస్థితులు వచ్చేలా కనిపించడంలేదని పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉగ్రవాదులు పర్యాటక ప్రాంతాలు, మార్కెట్లు, షాపింగ్‌ మాల్స్‌, ఆఫీస్‌లను లక్ష్యంగా దాడులు చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేసింది. అందుకే ఈ సమయంలో కశ్మీర్‌కు వెళ్లకపోవడమే మంచిదని పర్యాటకులకు ట్రావెల్‌ అడ్వైజరీ సూచించింది. 

ఇరు దేశాల మధ్య ఉన్న పరిస్థితుల దృష్ట్యా పాక్‌-భారత్‌ సరిహద్దుకు కనీసం పది కిలోమీటర్ల దూరంలోనే ఆగిపోవాలని పేర్కొంది. జమ్మూ-కశ్మీర్‌లోనే ఎక్కువగా ఉగ్రదాడులు జరుగుతున్నాయని, అదేవిధంగా స్థానిక ప్రజలు కూడా ఆందోళనలు చేస్తున్న కారణంగా తూర్పు లడఖ్‌, లేహ్‌ మినహా కశ్మీర్‌లో ఏ ప్రదేశానికి వెళ్లకూడదని అడ్వైజరీ సూచించింది. ఇక ఈ ఆదేశాలు కశ్మీర్‌ పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇక పాకిస్తాన్‌లో అమెరికా లెవల్‌ 3 హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పాక్‌కు వెళ్లకపోవడమే మంచిదని పర్యాటకులకు అమెరికా సూచించినట్లయింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement