పాక్పై దాడిని సమర్థించిన పాక్ సింగర్ | Adnan Sami Responds Being Trolled For Supporting Surgical Strikes | Sakshi
Sakshi News home page

పాక్పై దాడిని సమర్థించిన పాక్ సింగర్

Published Sat, Oct 1 2016 12:37 PM | Last Updated on Sat, Mar 23 2019 8:00 PM

పాక్పై దాడిని సమర్థించిన పాక్ సింగర్ - Sakshi

పాక్పై దాడిని సమర్థించిన పాక్ సింగర్

ప్రస్తుతం ప్రపంచం అంతా.. భారత్, పాక్పై చేసిన సర్జికల్ స్ట్రయిక్స్ గురించే మాట్లాడుతోంది. ముఖ్యంగా మోది నిర్ణయానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలో మోదీ తీసుకున్న నిర్ణయానికి, భారత సైన్యం తెగువకు ఓ పాక్ సింగర్ మద్దతు లభించింది. బాలీవుడ్తో పాటు టాలీవుడ్లో కూడా సక్సెస్ ఫుల్ పాటలు పాడిన సింగర్ అద్నాన్ సమీ సర్జికల్ స్ట్రయిక్స్కు మద్దతు తెలిపాడు.

పాక్ దేశస్థుడైన అద్నాన్, సింగర్గా ఘనవిజయాలు సాధించింది మాత్రం భారత్లోనే అందుకే భారత పౌరసత్వం తీసుకున్న అద్నాన్, ఇక్కడే సెటిల్ అయ్యాడు. దాడి ఘటనపై భారత్కు మద్దతు తెలిపిన అద్నాన్పై పాకిస్థాన్లో పెద్ద ఎత్తున విమర్శలు వెళ్లువెత్తాయి. ఈ విమర్శలపై స్పందించిన అద్నాన్, 'నా వ్యాఖ్యలపై పాకిస్తానీలు తీవ్రంగా స్పందిస్తున్నారు. వారి విమర్శల ద్వారా వాళ్లు పాకిస్తాన్, టెర్రరిజం రెండింటినీ ఒకటే అని భావిస్తున్నారని అనిపిస్తోంది' అంటూ ట్వీట్ చేశాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement