సమీ!.. స్వదేశం వెళ్లిపో :ఎమ్మెన్నెస్ | sami go back to pakistan : | Sakshi
Sakshi News home page

సమీ!.. స్వదేశం వెళ్లిపో :ఎమ్మెన్నెస్

Published Sat, Oct 12 2013 11:52 PM | Last Updated on Fri, Sep 1 2017 11:36 PM

sami go back to pakistan :


 పాక్ గాయకుడికి ఎమ్మెన్నెస్ హెచ్చరిక
 ముంబై: వీసా కాలపరిమితి ముగిసినా ముంబైలోనే ఉంటున్న పాక్ గాయకుడు అద్నన్ సమీ వెంటనే స్వదేశానికి వెళ్లిపోవాలని ఎమ్మెన్నెస్ శనివారం హెచ్చరించింది. ఎమ్మెన్నెస్ సినిమా విభాగం చిత్రపత్ కర్మచారి సేన అధ్యక్షుడు అమే ఖోప్కర్ మీడియాతో మాట్లాడుతూ ‘సమీ మమ్మల్ని శనివారం మా కార్యాలయంలోనే కలుసుకొని సాయం చేయాల్సిందిగా అభ్యర్థించాడు.
 
  వీసా పరిమితి ముగిసింది కాబట్టి భారత్‌ను వీడివెళ్లాలని మేం ఆయనకు సూచించాం’ అని వివరించారు. సమీ స్వచ్ఛం దంగా మీ కార్యాలయానికి వచ్చారా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఆయన అక్రమంగా భారత్‌లో నివసిస్తున్నట్టు ఫిర్యాదులు రావడంతో తామే పిలిపించామని తెలిపారు. తనకు పాకిస్థాన్ పాస్‌పోర్టు ఉందని, సమయానుగుణంగా జారీ అయ్యే వీసాతో భారత్‌లో నివసిస్తున్నానని ఈ గాయకుడు ముంబైలోని కుటుంబ న్యాయస్థానికి తెలిపారు.
 
 సమీకి భారత రాయబార కార్యాలయం గత ఏడాది సెప్టెంబర్ 26 నుంచి ఈ ఏడాది అక్టోబర్ ఆరు వరకు వీసా మంజూరు చేసింది. బాలీవుడ్‌తోపాటు దక్షిణాది భాషల్లోనూ ఇతడు పలు పాటలు పాడాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement