
ముంబై : పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా జైషే ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం సర్జికల్ స్ట్రైక్స్ చేసిన నేపథ్యంలో ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ హర్షం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌లో పుట్టిన అద్నాన్ కొన్నాళ్ల క్రితం భారత పౌరసత్వం పొందిన సంగతి తెలిసిందే. ‘భారత వైమానిక దళం పట్ల గర్వంగా ఉంది. హౌ ఈజ్ ద జోష్. ఉగ్రవాదాన్ని నిర్మూలించండి. జై హింద్’ అని ట్వీట్ చేశాడు. అద్నాన్ కామెంట్లపై పాక్ నెటిజన్లు ట్రోలింగ్ మొదలు పెట్టారు. (భారత్-పాక్ టెన్షన్: ట్రంప్ కీలక వ్యాఖ్యలు)
పాకిస్తాన్‌లో పుట్టి భారత్‌కు జై కొడతావా అంటూ పలువురు ట్రోల్ చేశారు. వారికి అద్నాన్ దీటైన సమాధానం ఇచ్చారు. ‘డియర్ పాక్ ట్రోల్స్.. ఇక్కడ ఇగో విషయం కాదు. నిజాన్ని గ్రహించండి. మీరూ, మేము శత్రువులుగా భావిస్తున్న ఉగ్రవాదులను ఏరివేయడం ఇక్కడ ముఖ్య విషయం. మీ నీచమైన మెంటాలిటీ చూస్తుంటే నవ్వోస్తోంది. మరీ దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు. లోపల ఒకటి పెట్టుకుని బయటకి మరొకటి మాట్లాడుతున్నారు. ఉష్ణపక్షిలాగా నిజాలను ఒప్పుకోరు. మీ అంత చండాలమైన మనస్తత్వం ఎవరికీ ఉండదు’ అని గట్టి కౌంటర్ ఇచ్చాడు.
Dear Pak trolls,
— Adnan Sami (@AdnanSamiLive) 26 February 2019
Its not about ur egos being given a reality check today; its about eliminating terrorists who u ‘claim’ r also ur enemies! Ur Ostrich mentality is laughable.Btw, ur abuses expose ur reality & therefore d only difference between u & a bucket of shit is the bucket!
Comments
Please login to add a commentAdd a comment