అద్నాన్ సమీకి మూడు నెలల వీసా గడువు పెంపు!
అద్నాన్ సమీకి మూడు నెలల వీసా గడువు పెంపు!
Published Thu, Oct 17 2013 6:01 PM | Last Updated on Sat, Mar 23 2019 8:40 PM
పాకిస్థానీ గాయకుడు, సంగీత దర్శకుడు అద్నాన్ సమీకి మూడు నెలల పాటు వీసా గడువును హోంమంత్రిత్వ శాఖ పెంచుతూ నిర్ణయం తీసుకుంది అని ఓ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. ఇటీవల అద్నాన్ సమీ వీసా గడువు ముగిసినా.. భారత్ లో ఉండటం వివాదస్పదంగా మారిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 6 తేది నుంచి మరో మూడు నెలలపాటు వీసా గడువును పెంచామని ముంబై డిప్యూటీ పోలీస్ కమిషనర్ సంజయ్ షింత్రే మీడియాకు తెలిపాడు.
అద్నాన్ సమీ వీసా 2006 సెప్టెంబర్ 26 నుంచి 2013 అక్టోబర్ 6 తేది వరకు వీసా అనుమతి ఉంది. గత కొద్ది సంవత్సరాలుగా అద్నాన్ సమీ ముంబైలో నివాసముంటున్నారు. వీసా గడువు పూర్తయిన వెంటనే అద్నాన్ సమీకి ముంబై సోలీసులు నోటీసులు జారీ చేశారు. తాను వీసా గడువు పెంపు కోసం దరఖాస్తు చేసుకున్నానని నోటీసులకు సమీ జవాబిచ్చారు.
Advertisement
Advertisement