'అది ఊహించని ఫోన్ కాల్' | Lata Mangeshkar surprised Adnan Sami with phone call | Sakshi
Sakshi News home page

'అది ఊహించని ఫోన్ కాల్'

Published Sat, Jul 11 2015 4:57 PM | Last Updated on Sun, Sep 3 2017 5:19 AM

'అది ఊహించని ఫోన్ కాల్'

'అది ఊహించని ఫోన్ కాల్'

ప్రఖ్యాత సినీ నేపథ్య గాయని లలా మంగేష్కర్ తనకు అభినందనలు తెలపడం పట్ల గాయకుడు అద్నాన్ సమీ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు.

ముంబై:ప్రఖ్యాత సినీ నేపథ్య గాయని లతా మంగేష్కర్ తనకు అభినందనలు తెలపడం పట్ల  గాయకుడు అద్నాన్ సమీ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఇందుకు సల్మాన్ హీరోగా రూపొందుతున్న భజరంగీ భాయ్ జాన్ మూవీలో అద్నాన్ సమీ పాడిన పాటే కారణమట. అందులో 'భర్ దో జోలీ మేరీ'అనే పల్లవితో సాగే పాటను అద్నాన్ పాడాడు. దీనికి గాను లతా మంగేష్కర్ నుంచి ప్రశంసలతో కూడిన ఓ అరుదైన ఫోన్ కాల్ ను తాను రిసీవ్ చేసుకున్నట్లు అద్నాన్ తెలిపాడు.

 

 

దీనిపై తొలుత ఆశ్యర్యానికి గురైన అద్నాన్ తన సంతోషాన్ని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. 'నా పాటను అభినందిస్తూ లతాజీ నుంచి ఫోన్ కాల్ వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. ఆ ఫోన్ కాల్ వచ్చినప్పుడు చిన్న పిల్లాడిలా ఫీలయ్యా. ఆమె నుంచి వచ్చిన ఆ ప్రశంస  నిజంగా అద్బుతం' అని ఆద్నాన్ పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement