
ప్రముఖ గాయకుడు అద్నాన్ సమి ట్రోలర్స్‌కి మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తండ్రి వర్ధంతిని పురస్కరించుకుని అద్నాన్ సమి ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన ఫోటో షేర్ చేశారు. దీనిపై ఓ నెటిజన్ ‘అసలు మీ తండ్రి ఎక్కడ జన్మించారు.. ఎక్కడ మరణించారు’ అని ప్రశ్నించాడు. అందుకు అద్నాన్ సమి ‘నా తండ్రి 1942లో భారత్‌లో జన్మించారు.. 2009లో ఇండియాలోనే మరణించారు. చాలా ఇంకేమన్నా కావాలా’ అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు.
My father was born in 1942 in India & died in 2009 in India!!! Next! https://t.co/M11nbQonWh
— Adnan Sami (@AdnanSamiLive) August 15, 2019
పాకిస్తాన్ లాహోర్‌లో జన్మించిన అద్నాన్ సమి ఆ దేశ పౌరసత్వాన్ని వదులుకుని.. 2016లో భారత్ పౌరసత్వాన్ని పొందారు. తొలుత ఆయనకు కెనడా పౌరసత్వం ఉండేది.
Comments
Please login to add a commentAdd a comment