
అర్జున్ మహి, తనిష్క్ రాజన్
‘ఏ జిల్లా ఏ జిల్లా.., ఓ మధు ఓ మధు..., నేనంటే నాకూ చాలానే ఇష్టం’ వంటి సూపర్ హిట్స్ సాంగ్స్‌ని పాడిన సింగర్ అద్నాన్ సమీ. ‘‘ఆయన పాడారంటే పాటలో కచ్చితంగా కొత్తదనం ఉంటుంది. అలాగే మా సినిమాలో ‘అరెరే మాయే జరిగే.. ఇష్టంగా, మనసే నీదే అయ్యిందే.. ఇష్టంగా’ పాటను అద్నాన్ సమీ పాడారు. అదే మా ఫస్ట్ సక్సెస్’’ అంటున్నారు ‘ఇష్టంగా’ చిత్రబృందం. అర్జున్ మహి, తనిష్క్ రాజన్ జంటగా సంపత్ వి. రుద్ర దర్శకత్వంలో అడ్డూరి వెంకటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘ఇష్టంగా’. ‘‘మా ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. అద్నాన్ సమీ పాడిన ‘అరెరే మాయే..’ పాటను రిలీజ్ చేశాం. ఈ పాటకు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. సంగీత దర్శకుడు యేలేంద్రకు కృతజ్ఞతలు. అన్ని పనులు పూర్తయ్యాయి. త్వరలో సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి కెమెరా: ఆనంద్ నడకట్ల.
Comments
Please login to add a commentAdd a comment