
గత నెల 14న ఎన్టీఆర్ దంపతులకు మగ బిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ముద్దులొలికే చిన్నారి ఫొటోను అభిమానుల కోసం తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసిన ఎన్టీఆర్ తాజాగా చిన్నారి పేరును రివీల్ చేశారు. తమ రెండో కుమారుడికి భార్గవ రామ్ అని నామకరణం చేశారు ఎన్టీఆర్, ప్రణీత దంపతులు. వీరికి ఇప్పటికే అభయ్ రామ్ అనే కొడుకు ఉన్నాడు.
ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అరవింద సమేత షూటింగ్‌లో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా రాయలసీమ ఫ్యాక్షన్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఆ సినిమాలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్‌తో సరికొత్త లుక్‌లో దర్శనమివ్వనున్నాడు.
The little one is, Bhargava Ram https://t.co/2mp6DTTMO0
— Jr NTR (@tarak9999) 4 July 2018