Jr NTR Shares His Son Abhay Ram and Bhargav Ram Photos in Paris Tour - Sakshi
Sakshi News home page

Jr NTR Family Paris Tour: అరుదైన ఫొటోలు షేర్‌ చేసిన తారక్‌

Published Tue, Nov 23 2021 2:56 PM | Last Updated on Tue, Nov 23 2021 9:05 PM

Jr NTR Shares His Son Abhay Ram And Bhargav Ram Photos In Paris Tour - Sakshi

Jr NTR Shares Cute Pictures Of His Sons Abhay Ram And Bhargav Ram In Paris Tour: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కుటుంబంతో కలిసి ప్యారిస్‌ పర్యటనకు వెళ్లాడు. ఇటీవలే ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తి కావడంతో పాటు ఆయన హోస్ట్‌ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరు’ షో ఎపిసోడ్స్‌ను షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకున్నాడు. దీంతో ఫ్యామిలీతో కలిసి అలా సరదాగా గడిపేందుకు తారక్‌ రెండు రోజుల క్రితం ప్యారిస్‌ పయనమయ్యాడు. అక్కడ భార్య పిల్లలతో కలిసి ఎంజాయ్‌ చేస్తున్న ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు ఈ యంగ్‌ టైగర్‌.

చదవండి: నిక్‌తో ప్రియాంక విడాకులు? తల్లి మధు చోప్రా క్లారిటీ

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. అయితే ఎన్టీఆర్‌ తన ఫ్యామిలీ విషయాలను.. తన తనయుల ఫోటోలను చాలా అరుదుగా పంచుకుంటాడు. చాలా రోజుల తర్వాత కుటుంబంతో కలిసి ఫారిన్ ట్రిప్ చేశారు తారక్. ఈ క్రమంలో నిన్న తన పెద్ద కుమారుడు అభయ్ రామ్‏ను ఈఫిల్ టవర్ వద్ద ముద్దాడుతున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా అక్కడ లోకల్‌ ట్రెన్‌లో ప్రయాణిస్తు తన చిన్న కుమారుడు భార్గవ్ రామ్‏తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశాడు.

చదవండి: పునీత్‌ స్టైల్లో ‘నాటు నాటు’ సాంగ్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ టీం ఫిదా

ట్రైన్‏లో భార్గవ్ రామ్‌ని ముద్దాడుతూ కనిపించాడు తారక్. మరోవైపు.. ఎన్టీఆర్ సతిమణి ప్రణతి ఒడిలో ఎంతో ఒద్దికగా కూర్చున్నాడు భార్గవ్ రామ్. ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. ‘నాకు ఎన్నో చెప్పాలని ఉంది.. కానీ ప్రస్తుతానికి ఈ జర్నీని ఎంజాయ్ చేస్తున్నా’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ తనయుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే  ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement