Jr NTR And Family Spotted At Hyderabad Airport, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Jr Ntr: ఫ్యామిలీతో ఎన్టీఆర్ వెకేషన్ ట్రిప్..ఫోటోలు, వీడియోలు వైరల్‌

Published Mon, May 29 2023 10:53 AM | Last Updated on Mon, May 29 2023 11:59 AM

Jr Ntr And Family Spotted At Hyderabad Airport Video Goes Viral - Sakshi

ఓవైపు సినిమాలు చేస్తూనే ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడతారు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్‌ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభం కానుంది.

ఈ క్రమంలో షూటింగ్‌కు ముందే భార్య లక్ష్మీ ప్రణతి, కొడుకులు ఆభయ్, భార్గవ్ రామ్‍లతో కలసి వెకేషన్‌కు వెళ్లారు. ఈ మేరకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వాళ్లు దర్శనమిచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

ముఖ్యంగా తారక్‌ చిన్న కోడుకు భార్గవ్‌ రామ్‌ భలే క్యూట్‌గా ఉన్నాడంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా ఈ వెకేషన్‌ ట్రిప్‌ చాలా చిన్నదని, మళ్లీ వారం రోజుల తర్వాత ఎన్టీఆర్‌ హైదరబాద్‌కు చేరుకుంటారని, ఆ వెంటనే కొరటాల శివ డైరెక్షన్‌లో దేవర షూటింగ్‌లో పాల్గొంటారని తెలుస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement