
యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యకంగా పరిచయం చేయాల్సి పనిలేదు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా పాపులర్ అయిన తారక్ ఏమాత్రం సమయం దొరికినా ఫ్యామిలీతో గడపడానికి ఇష్టపడుతుంటారు. ఇక ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి సినిమా ఈవెంట్స్‌లో పెద్దగా కనిపించదు. స్టార్ హీరో భార్య అయినప్పటికీ లోప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు.
ఆమెకు సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్న దాఖలాలు లేవు. అటు ఎన్టీఆర్ కూడా ఫ్యామిలీకి సంబంధించిన మూమెంట్స్‌ను చాలా అరుదుగా షేర్ చేస్తుంటారు. ఇదిలా ఉంటే రంజాన్ సీజన్ కావడంతో హైదరాబాద్ వాసులు చార్మినార్‌లో నైట్ బజార్‌కి క్యూ కడుతున్నారు.
తాజాగా ఎన్టీఆర్ భార్య ప్రణతి కూడా నైట్ బజార్‌లో షాపింగ్ చేస్తూ సందడి చేసింది. దీనికి సంబంధించిన ఓ ఫోటో లీక్ కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ పిక్‌ని షేర్లు చేస్తూ వైరల్ చేస్తున్నారు. స్టార్ స్టేటస్ ఉండి కూడా ప్రణతి ఇలా సింపుల్‌గా కనిపిస్తుండటంతో ఆమె సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment