paris tour
-
ఏపీకి చేరుకున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి:ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని ఏపీకి చేరుకున్నారు. ఆదివారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం జగన్‌కు మంత్రి జోగి రమేష్, సీఎస్ తదితరులు స్వాగతం పలికారు. గత నెల 28వ తేదీన సీఎం వైఎస్ జగన్ పారిస్‌కు బయల్దేరి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ తన కుమార్తె హర్ష గ్రాడ్యుయేషన్ కాన్వొకేషన్ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. తిరిగి నిన్న సాయంత్రం(జూలై) 2న సాయంత్రం 4 గంటలకు పారిస్‌లో బయలుదేరి ఈరోజు(ఆదివారం) ఉదయం గన్నవరం చేరుకున్నారు. ఇక్కడ చదవండి: CM Jagan Tweet: డియర్ హర్ష.. గర్వంగా ఉంది -
28న ప్యారిస్‌కు సీఎం జగన్
సాక్షి, అమరావతి: నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 28న ఫ్రాన్స్‌కు వెళ్తున్నారు. తన పెద్ద కుమార్తె హర్ష.. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్(ఎంబీఏ) పూర్తి చేసుకోవడంతో.. గ్రాడ్యుయేషన్ డే వేడుకలో పాల్గొనడానికి వెళ్తున్నారు. ఈ విషయాన్ని సీఎంవో తెలియజేసింది. 28న రాత్రి బయలుదేరనున్న సీఎం జగన్.. 29న ప్యారిస్‌కు చేరుకుంటారు. కుమార్తె గ్రాడ్యుయేషన్ డే వేడుకలో పాల్గొన్న తర్వాత.. జులై 2న తిరుగు ప్రయాణం అవుతారు. -
కుటుంబంతో ఎన్టీఆర్ ఫారిన్ టూర్, అరుదైన ఫొటోలు షేర్ చేసిన తారక్
Jr NTR Shares Cute Pictures Of His Sons Abhay Ram And Bhargav Ram In Paris Tour: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కుటుంబంతో కలిసి ప్యారిస్ పర్యటనకు వెళ్లాడు. ఇటీవలే ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తి కావడంతో పాటు ఆయన హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరు’ షో ఎపిసోడ్స్‌ను షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకున్నాడు. దీంతో ఫ్యామిలీతో కలిసి అలా సరదాగా గడిపేందుకు తారక్ రెండు రోజుల క్రితం ప్యారిస్ పయనమయ్యాడు. అక్కడ భార్య పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు ఈ యంగ్ టైగర్. చదవండి: నిక్‌తో ప్రియాంక విడాకులు? తల్లి మధు చోప్రా క్లారిటీ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. అయితే ఎన్టీఆర్ తన ఫ్యామిలీ విషయాలను.. తన తనయుల ఫోటోలను చాలా అరుదుగా పంచుకుంటాడు. చాలా రోజుల తర్వాత కుటుంబంతో కలిసి ఫారిన్ ట్రిప్ చేశారు తారక్. ఈ క్రమంలో నిన్న తన పెద్ద కుమారుడు అభయ్ రామ్‌ను ఈఫిల్ టవర్ వద్ద ముద్దాడుతున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా అక్కడ లోకల్ ట్రెన్‌లో ప్రయాణిస్తు తన చిన్న కుమారుడు భార్గవ్ రామ్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశాడు. చదవండి: పునీత్ స్టైల్లో ‘నాటు నాటు’ సాంగ్, ఆర్ఆర్ఆర్ టీం ఫిదా ట్రైన్లో భార్గవ్ రామ్‌ని ముద్దాడుతూ కనిపించాడు తారక్. మరోవైపు.. ఎన్టీఆర్ సతిమణి ప్రణతి ఒడిలో ఎంతో ఒద్దికగా కూర్చున్నాడు భార్గవ్ రామ్. ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. ‘నాకు ఎన్నో చెప్పాలని ఉంది.. కానీ ప్రస్తుతానికి ఈ జర్నీని ఎంజాయ్ చేస్తున్నా’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ తనయుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Jr NTR (@jrntr) View this post on Instagram A post shared by Jr NTR (@jrntr) -
రెండై తిరిగే ఒకే ఓ రూపం..
‘బ్రదర్స్’ సినిమా కోసం చంద్రబోస్ రాసిన ‘రెండై తిరిగే..’ పాటను గుర్తుచేసుకుంటున్నారు మహేశ్ బాబు అభిమానులు! కొడుకు గౌతంతో కలిసి ప్రిన్స్ పారిస్ వీధుల్లో పర్యటిస్తోన్న ఫొటోలు.. ‘రెండై పలికే ఒకే ఓ రాగం.. రెండై వెలిగే దీపం మేమంటా..’ తరహాలో ఉన్నాయని, ఆ ఇద్దరూ తండ్రీకొడుకుల కంటే అన్నదమ్ముల్లా కనిపిస్తున్నారని ఫ్యాన్స్ వ్యాఖ్యానిస్తున్నారు. ‘భరత్ అనే నేను’ సక్సెస్ తర్వాత మహేశ్ ఫ్యామిలీతో కలిసి పారిస్ వెళ్లిన సంగతి తెలిసిందే. తమ పర్యటనకు సంబంధించిన వివరాలను నమత్రా ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్నారు. కొద్ది గంటల కిందటే..‘Two of a kind’ అంటూ ఆమె పోస్ట్ చేసిన మహేశ్-గౌతమ్‌ల ఫొటోకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అతికొద్దిరోజుల్లోనే తిరిగి హైదరాబాద్ రానున్న మహేశ్.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న మల్టీస్టారర్ షూటింగ్లో పాల్గొననున్నాడు. -
తండ్రీకొడుకులు అక్కడే ప్రపోజ్ చేశారు!
ముంబై: బాలీవుడ్ లో ఎలాంటి కలహాలు లేకుండా జీవితాన్ని హాయిగా గడుపుతున్న దంపతులలో సైఫ్ అలీ ఖాన్, కరీనాకపూర్ జంట ఒకటని చెప్పవచ్చు. అయితే రాజుల కుటుంబానికి చెందిన వాడైనా.. ప్రేమ అనే విషయంలో కాస్త తగ్గాల్సి వస్తుందనేది సైఫ్ విషయంలోనూ నిజమైంది. ఎందుకంటే పారిస్ టూర్ లో ఉన్న సమయంలో తొలిసారి రిట్జ్ హోటల్ వద్ద సైఫ్ తనకు ప్రపోజ్ చేశాడని 'బెబో' కరీనా చెప్పింది. అయితే అందుకు తాను నో చెప్పినట్లు అప్పటి విషయాలను గుర్తుచేసుకుంది. రెండోసారి పారిస్ లో ఉన్నప్పుడే.. ఓ చర్చ్ వద్ద మరోసారి తనను ప్రేమిస్తున్న్టట్లు సైఫ్ చెప్పగా రెండు రోజులు టైం తీసుకుని ఓకే చెప్పినట్లు కరీనా వివరించింది. మరో విశేషమేమంటే.. తన మామగారు, క్రికెటర్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ(సైఫ్ తండ్రి) కూడా ఇక్కడే తన ప్రేమను పరీక్షించుకున్నాడట. తన అత్త, నటి షర్మిలా ఠాకూర్ వద్దకు వెళ్లి 'టైగర్' పటౌడీ ప్రేమ ప్రతిపాదన తీసుకొచ్చారని, చివరికి కథ సుఖాంతమైందని కరీనా చెప్పింది. కరీనా, సైఫ్ 2012లో వివాహం చేసుకోగా, ప్రస్తుతం కరీనా గర్భవతిగా ఉన్న విషయం తెలిసిందే.