రెండై తిరిగే ఒకే ఓ రూపం.. | Mahesh Babu Wife Namratha Shirodkar Shares Their Paris Tour Pics | Sakshi
Sakshi News home page

రెండై తిరిగే ఒకే ఓ రూపం..

May 9 2018 8:49 AM | Updated on Jul 25 2018 2:35 PM

Mahesh Babu Wife Namratha Shirodkar Shares Their Paris Tour Pics - Sakshi

‘బ్రదర్స్‌’ సినిమా కోసం చంద్రబోస్‌ రాసిన ‘రెండై తిరిగే..’ పాటను గుర్తుచేసుకుంటున్నారు మహేశ్‌ బాబు అభిమానులు! కొడుకు గౌతంతో కలిసి ప్రిన్స్‌ పారిస్‌ వీధుల్లో పర్యటిస్తోన్న ఫొటోలు.. ‘రెండై పలికే ఒకే ఓ రాగం.. రెండై వెలిగే దీపం మేమంటా..’ తరహాలో ఉన్నాయని, ఆ ఇద్దరూ తండ్రీకొడుకుల కంటే అన్నదమ్ముల్లా కనిపిస్తున్నారని ఫ్యాన్స్‌ వ్యాఖ్యానిస్తున్నారు.

‘భరత్‌ అనే నేను’  సక్సెస్‌ తర్వాత మహేశ్‌ ఫ్యామిలీతో కలిసి పారిస్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. తమ పర్యటనకు సంబంధించిన వివరాలను నమత్రా ఎప్పటికప్పుడు షేర్‌ చేస్తున్నారు. కొద్ది గంటల కిందటే..‘Two of a kind’ అంటూ ఆమె పోస్ట్‌ చేసిన మహేశ్‌-గౌతమ్‌ల ఫొటోకు ఫ్యాన్స్‌ ఫిదా అయిపోయారు. అతికొద్దిరోజుల్లోనే తిరిగి హైదరాబాద్‌ రానున్న మహేశ్‌.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న మల్టీస్టారర్‌ షూటింగ్‌లో పాల్గొననున్నాడు.

1
1/5

2
2/5

3
3/5

4
4/5

5
5/5

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement