తండ్రీకొడుకులు అక్కడే ప్రపోజ్ చేశారు! | Saif Ali Khan propose to Kareena Kapoor in paris | Sakshi
Sakshi News home page

తండ్రీకొడుకులు అక్కడే ప్రపోజ్ చేశారు!

Published Fri, Sep 30 2016 5:32 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

తండ్రీకొడుకులు అక్కడే ప్రపోజ్ చేశారు! - Sakshi

తండ్రీకొడుకులు అక్కడే ప్రపోజ్ చేశారు!

ముంబై: బాలీవుడ్ లో ఎలాంటి కలహాలు లేకుండా జీవితాన్ని హాయిగా గడుపుతున్న దంపతులలో సైఫ్ అలీ ఖాన్, కరీనాకపూర్ జంట ఒకటని చెప్పవచ్చు. అయితే రాజుల కుటుంబానికి చెందిన వాడైనా.. ప్రేమ అనే విషయంలో కాస్త తగ్గాల్సి వస్తుందనేది సైఫ్ విషయంలోనూ నిజమైంది. ఎందుకంటే పారిస్ టూర్ లో ఉన్న సమయంలో తొలిసారి రిట్జ్ హోటల్ వద్ద సైఫ్ తనకు ప్రపోజ్ చేశాడని 'బెబో' కరీనా చెప్పింది. అయితే అందుకు తాను నో చెప్పినట్లు అప్పటి విషయాలను గుర్తుచేసుకుంది.

రెండోసారి పారిస్ లో ఉన్నప్పుడే.. ఓ చర్చ్ వద్ద మరోసారి తనను ప్రేమిస్తున్న్టట్లు సైఫ్ చెప్పగా రెండు రోజులు టైం తీసుకుని ఓకే చెప్పినట్లు కరీనా వివరించింది. మరో విశేషమేమంటే.. తన మామగారు, క్రికెటర్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ(సైఫ్ తండ్రి) కూడా ఇక్కడే తన ప్రేమను పరీక్షించుకున్నాడట. తన అత్త, నటి షర్మిలా ఠాకూర్ వద్దకు వెళ్లి 'టైగర్' పటౌడీ ప్రేమ ప్రతిపాదన తీసుకొచ్చారని, చివరికి కథ సుఖాంతమైందని కరీనా చెప్పింది. కరీనా, సైఫ్ 2012లో వివాహం చేసుకోగా, ప్రస్తుతం కరీనా గర్భవతిగా ఉన్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement