టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సి పనిలేదు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్‌గా మారిపోయారు. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తోన్న చిత్రం 'దేవర'. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ చిత్రం ద్వారా ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.
అయితే తాజాగా ఎన్టీఆర్ సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. జూనియర్ 2011లో వివాహాబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రముఖ వ్యాపారవేత్త నార్నె శ్రీనివాసరావు కుమార్తె లక్ష్మీ ప్రణతిని ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్నారు. మే 5వతేదీన 2011లో జరిగిన వీరి వివాహాం అత్యంత వైభవంగా జరిగింది. కాగా.. ఈ జంటకు అభయ్ రామ్, భార్గవ్ రామ్ అనే కుమారులు జన్మించారు.
(ఇది చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. 'కల్కి' ఇప్పట్లో రావడం కష్టమే!)
అయితే జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి పెళ్లిలో కట్టుకున్న చీరపై నెట్టింట చర్చ నడుస్తోంది. ఆమె ధరించిన బంగారు వర్ణం గల చీర ధర దాదాపు కోటి రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అంతే కాకుండా ఎన్టీఆర్ పెళ్లి వేడుకల కోసం దాదాపు రూ.100 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
పెళ్లి చీర ప్రత్యేకతలు
ఎన్టీఆర్ భార్ ప్రణతి ధరించిన అంత భారీ ధర పలకడానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. పెళ్లి రోజు బంగారు వర్ణంలో ఉన్న చీరను తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా ధరించింది. లక్ష్మీ ప్రణతి కంజీవరం చీరలో స్వచ్చమైన బంగారం, వెండితో నేసినట్లుగా సమాచారం. ఆమె చీరకు తగినట్లుగానే బంగారు, వజ్రాల నెక్లెస్, మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా వేసుకున్నారు. వాటితో పాటు ఒక జత డైమండ్ ఇయర్ రింగ్స్ కూడా ధరించింది. జూనియర్ ఎన్టీఆర్ సంప్రదాయమైన తెల్లని కుర్తా, ధోతీతో మెరిసిపోయారు.
అప్పట్లోనే జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి కళ్యాణ మండపం విలువ రూ. 18 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకలో 3 వేల మంది అతిథులు, దాదాపు 12,000 మంది అభిమానులు హాజరయ్యారు. కాగా.. ఈ జంటకు 2014లో తమ మొదట అభయ్ రామ్ జన్మించగా.. 2019లో భార్గవరామ్‌ను స్వాగతించారు. ఈ ఏడాది మార్చిలో ప్రణతి తన 30 బర్త్‌డేను కుటుంబసభ్యుల సమక్షంలో ఘనంగా జరుపుకుంది. భార్య 30వ బర్త్‌డేను మరింత స్పెషల్‌గా చేస్తూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి బర్త్‌డే పార్టీ ఇచ్చారు తారక్.
(ఇది చదవండి: ఆ సీన్‌లో ఎలాంటి తప్పులేదు.. మహాభారత్ నటుడు షాకింగ్ కామెంట‍్స్!)
Comments
Please login to add a commentAdd a comment