
బుల్లితెరపై యాంకర్‌గానూ వెండితెరపై నటిగానూ సత్తా చాటింది హరితేజ. తనకున్న క్రేజ్‌తో బిగ్‌బాస్ మొదటి సీజన్‌లోనూ అడుగు పెట్టిన ఆమె తన అల్లరితో, ఆటతో మరెంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఎక్కువగా వెండితెరపైనే ఫోకస్ పెట్టిన ఈ నటి ఇటీవలే ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె తన ఇంట్లో కూతురి బారసాల ఫంక్షన్ జరిపింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో కూతురి ఫొటోను షేర్ చేసింది కానీ అందులో పాప ముఖం మాత్రం క్లారిటీగా చూపించలేదు.
అయితే కూతురికి భూమి దీపక్‌రావు అని నామకరణం చేసినట్లు వెల్లడించింది. "మా అమ్మానాన్న నాకు భూమి దీపక్ రావు అని పేరు పెట్టారు. భూమి అంటే చాలా సహనంతో ఉంటుందనుకుంటున్నారేమో.. కానీ వాళ్లకేం తెలుసు.. సహనాన్ని పరీక్షిస్తే భూకంపాలే అని.. మీరందరూ నన్ను భూమి అని పిలవచ్చు" అంటూ క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది. మొత్తానికి భూమిని ఎత్తుకున్న హరితేజ దంపతుల ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
కాగా డెలివరీ టైంలో హరితేజ ఎన్నో ఇబ్బందులు పడింది. తొమ్మిది నెలలు నిండిన సమయంలో ఆమెతో సహా ఇంట్లో అందరికీ(హరితేజ భర్తకు తప్ప) కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తను టెన్షన్ పడితే కడుపులో ఉన్న బిడ్డకు మంచిది కాదని ఎక్కడలేని ధైర్యాన్ని కూడదీసుకుంది. బాధను దిగమింగుతూ బేబీ కోసం బలవంతంగా ముద్దలు తినేది.
డెలివరీ అయిన తర్వాత పాపకు నెగెటివ్ వచ్చిందన్న సంతోషం ఒకవైపు, పాపను కనీసం తాకనివ్వలేదు సరికదా, నేరుగా చూడనివ్వలేదన్న బాధ మరోవైపు ఆమెను స్థిమితంగా ఉండనివ్వలేదు. చివరకు పాప పుట్టిన 11 రోజులకు నెగెటివ్ రావడంతో పాపను చేతుల్లోకి తీసుకుని గుండెలకు హత్తుకుంది హరితేజ.
Comments
Please login to add a commentAdd a comment