
కన్నడ స్టార్ యశ్ ఇంట ఆయన కుమారుడి నామకరణ మహోత్సవం జరిగింది. యశ్, రాధికల రెండో సంతానానికి ఇద్దరి పేర్లలోని అక్షరాలు కలిసి వచ్చేలా "యధర్వ్" అని పేరు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియోను రాఖీ భాయ్ అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వీడియోలో పచ్చని తోట మధ్యలో పూల పందిరి వేశారు. ఆ పందిట్లోకి రాధిక కొడుకును, యశ్ కూతురు ఐరాను ఎత్తుకుని వచ్చారు. యశ్‌తోపాటు, యధర్వ్ ఇద్దరూ పంచె కట్టుకుని పూజలో పాల్గొన్నారు. (చదవండి: బిగ్‌బాస్‌కు హ్యాండ్ ఇచ్చిన రఘు మాస్టర్!)
ఈ కార్యక్రమానికి తక్కువ మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. కాగా యధర్వ్ ఆడుకుంటున్న ఫొటోలను కూడా హీరో తరచూ అభిమానులతో పంచుకుంటున్నారు. ఇదిలా వుండగా యశ్ ప్రస్తుతం కేజీఎఫ్ 2 సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను థియేటర్లలో దసరా కానుకగా అక్టోబర్ 23న విడుదల చేయనున్నారు. (చదవండి: ప్రకాశ్ రాజ్ ఆ పాత్ర చేయడం లేదు!)
Comments
Please login to add a commentAdd a comment