యశవంతపుర: కుమారుడి నామకరణం కోసం ఓ వైపు ఏర్పాట్లు జరుగుతుండగా మరో వైపు ఆ ఇంటిని విషాదం కమ్మేసింది. వేడుకకు అవసరమయ్యే సరుకుల కోసం వెళ్లిన చిన్నారి తండ్రి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
కర్ణాటక కలబురిగి జిల్లా జీవర్గి పట్టణంలో మంగళవారం రాత్రి జరిగింది. హరనూరు గ్రామానిచి చెందిన బసలింగప్ప(28) ఈ మధ్యే బిడ్డ పుట్టాడు. కుమారుడికి బుధవారం నామకరణం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అవసరమైన సరుకుల కోసం బసలింగప్ప, బంధువు మహంతయ్య(60)లు బైకుపై జీవర్గికి వెళ్తుండగా వెనుకనుంచి బస్సు ఢీకొంది.
ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ బస్సును వదిలేసి పరారయ్యాడు. పట్టణ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.
ఇదీ చదవండి: వీడసలు భర్తేనా?.. తండ్రిగా కూడా ఘోరం అసలు
Comments
Please login to add a commentAdd a comment