yasvantapura
-
బిడ్డకు పేరుపెట్టే సంబురం.. కమ్మేసిన విషాదం
యశవంతపుర: కుమారుడి నామకరణం కోసం ఓ వైపు ఏర్పాట్లు జరుగుతుండగా మరో వైపు ఆ ఇంటిని విషాదం కమ్మేసింది. వేడుకకు అవసరమయ్యే సరుకుల కోసం వెళ్లిన చిన్నారి తండ్రి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కర్ణాటక కలబురిగి జిల్లా జీవర్గి పట్టణంలో మంగళవారం రాత్రి జరిగింది. హరనూరు గ్రామానిచి చెందిన బసలింగప్ప(28) ఈ మధ్యే బిడ్డ పుట్టాడు. కుమారుడికి బుధవారం నామకరణం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అవసరమైన సరుకుల కోసం బసలింగప్ప, బంధువు మహంతయ్య(60)లు బైకుపై జీవర్గికి వెళ్తుండగా వెనుకనుంచి బస్సు ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ బస్సును వదిలేసి పరారయ్యాడు. పట్టణ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. ఇదీ చదవండి: వీడసలు భర్తేనా?.. తండ్రిగా కూడా ఘోరం అసలు -
పెళ్లి పేరుతో వంచించి.. అత్యాచారం
► గర్భం దాల్చిన మైనర్ బాలిక ► నిందితుడి అరెస్ట్ యశ్వంతపుర: ఓ యువకుడు మాయమాటలతో బాలికను లోబర్చుకొని వివాహం చేసుకుంటానని నమ్మించాడు. నెలల తరబడి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈక్రమంలో బాలిక గర్భం దాల్చింది. విషయం వెలుగు చూడటంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిని అరెస్ట్ చేశారు మంగళూరు జిల్లాలోని కోణాజేకు చెందిన అనూప్ జోగి (28) బెంగళూరులోని ఓ న్యూస్ చానల్లో వీడియో గ్రాఫర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన 9వ తరగతి విద్యార్థినితో రెండేళ్లుగా పరిచయం పెంచుకున్నాడు. వివాహం చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు. వివాహం చేసుకోవాలని బాలిక కోరగా బెదిరిస్తూ వచ్చాడు. దీంతో బాలిక విషయాన్ని బయటకు చెప్పకుండా ఉండి పోయింది. బాలిక శరీరంలో వచ్చిన మార్పులను గమనించిన తల్లిదండ్రులు ఆరా తీయగా అత్యాచార ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించగా ఎనిమిది నెలల గర్భవతి అని తేలింది. ఈ విషయంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు బెంగళూరులో ఉండటంతో అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే నిందితుడు మంగళూరులోనే ఉన్నట్లు తేలడంతో కొణాజే పోలీసులు గాలింపు చేపట్టి అరెస్ట్ చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.