
బిగ్‌బాస్ సీజన్ 7 ఇప్పుడిప్పుడే కాస్త రసవత్తరంగా మారుతోంది. కంటెస్టెంట్స్ అంతా కాస్త సీరియస్‌గా గేమ్స్ ఆడుతున్నారు. పోటీలో గెలిచేందుకు వందశాతం ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒకే ఒక కంటెస్టెంట్ మాత్రం సీజన్ ప్రారంభం నుంచి గేమ్ ఆడట్లేదు. అతనే శివాజీ. ప్లేయర్‌గా హౌస్‌లోకి వెళి కోచ్‌గా అవతారమెత్తాడు. పోని అలా అయినా న్యాయంగా ఉంటున్నాడా అంటే.. ‘అబ్బే..మనవి మాటలే’ అంటున్నాడు. నీతి ముచ్చట్లు చెప్పడమే కానీ..పాటించడం మన హిస్టరీలోనే లేదంటున్నాడు. ఇతరులకు ఓ న్యాయం తనకో న్యాయం అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు.
అయితే హౌస్‌లో అంతా అతని మాయ మాటలకు పడిపోతే.. గౌతమ్ కృష్ణ మాత్రం అవకాశం వచ్చినప్పుడల్లా శివాజీ నిజస్వరూపం బయటపెడుతున్నాడు. మరోవైపు అమర్‌దీప్ కూడా ఆ ప్రయత్నం చేస్తున్నాడు కానీ.. శివాజీ తెలివిగా వ్యవహరిస్తూ..అతన్ని బకరా చేస్తున్నారు. ఈ విషయం షో వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఈజీగా అర్థమవుతుంది. తాజాగా బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ మానస్ కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తూ.. శివాజీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
శివాజీ లాంటి కంటెస్టెంట్‌ని చూడలేదు: మానస్
బిగ్‌బాస్ షోలో అమర్‌దీప్, శివాజీల మధ్య కోల్డ్‌వార్ జరుగుతోంది. ప్రతిసారి చిన్న చిన్న కారణాలు చెప్పి అమర్‌దీప్‌ని నామినేట్ చేస్తున్నాడు శివాజీ. అంతేకాదు తనకు నచ్చినవాళ్లు తప్పు చేస్తే సమర్థిస్తాడు.. అదే అమర్‌దీప్, గౌతమ్ కృష్ణ చిన్న మిస్టేక్ చేసినా..దాన్ని భూతద్దంలో పెట్టి ప్రచారం చేస్తాడు. పైగా తెలివిగా హౌస్‌లోని మిగతా కంటెస్టెంట్స్‌కి కూడా తన అభిప్రాయాన్ని రుద్దే ప్రయత్న చేస్తాడు. తాజగా ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని మానస్ చెప్పాడు.
‘ప్రతీ సీజన్‌లో శివాజీ లాంటి విలన్స్ ఉంటారు. కానీ హీరో ఎవరనేది ప్రేక్షకులే నిర్ణయిస్తారు. శివాజీ కేవలం ఇద్దరి పట్ల మాత్రమే వ్యక్తిగత ఇష్టం చూపిస్తున్నాడు. మిగిలిన కంటెస్టెంట్ల గేమ్ చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటివరకు నేను రకరకాల మైండ్ సెట్ ఉన్నవాళ్లను చూశాను. కానీ శివాజీ లాంటి కంటెస్టెంట్‌ను ఇప్పటివరకు చూడలేదు’అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment