
Maanas Rock Star Movie Poster Released: చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో చిత్రాల్లో నటించి తర్వాత నటుడిగా, హీరోగా మరెన్నో వైవిధ్యమైన కథాంశాలతో కూడుకున్న చిత్రాల్లో నటించి బాగా పాపులర్ అయ్యాడు మానస్. బిగ్ బాస్ సీజన్ 5 లో 16వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన మానస్ తనదైన శైలిలో గేమ్ ఆడుతూ ప్రేక్షకుల్ని మెప్పించి టాప్5 లో స్థానం సంపాదించుకున్నాడు. మాటల్లో మెచ్యూరిటీ, టాస్కుల్లో చూపించే ఎనర్జీకి అందరూ ఫిదా అయ్యారు. తోటి కంటెస్టెంట్ ప్రియాంక సింగ్ పట్ల అతను చూపించిన కేరింగ్, అతని మెచ్యూర్డ్ థింకింగ్‌కు యువత మాత్రమే కాదు కుటుంబ ప్రేక్షకులు కూడా మానస్‌కు ఆకర్షితులయ్యారు. పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అయిన మానస్‌కు పవర్ స్టార్ అభిమానులు మద్దతిస్తూ అతడు టైటిల్ గెలవాలని సోషల్ మీడియాలో మద్దతిస్తున్నారు.
తాజాగా 'మానస్ రాక్ స్టార్' అనే పోస్టర్‌ను ఆవిష్కరించిన కార్యక్రమంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ మానస్ టైటిల్ విన్నర్ కావాలని కోరుకుంటూ అతనికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఎం.ఆర్.చౌదరి, టీర్‌ఎస్ లీడర్ నాగమణి, ఇంటర్నేషనల్ డ్రెస్సెస్ డిజైనర్ అపర్ణ, మానస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డా.తేజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment