
మానస్ గురించి నేను చాలా విన్నాను. అతడు బిగ్‌బాస్ హౌస్‌లో ఇరగదీస్తున్నాడు. అందరూ అతడికి...
Bigg Boss 5 Telugu, Malvika Sharma Supports Maanas: బిగ్‌బాస్ షో ముగింపుకు వచ్చేకొద్దీ సెలబ్రిటీలు వారి అభిమాన కంటెస్టెంట్‌ను గెలిపించడం కోసం బయట బాగానే కష్టపడుతున్నారు. కొందరు షో ప్రారంభం నుంచి సపోర్ట్ చేసుకుంటూ వస్తుంటే మరికొంతమంది ఫైనల్ ఎపిసోడ్‌కు రెండు వారాలే గడువు ఉన్న నేపథ్యంలో తమ మద్దతు ప్రకటిస్తున్నారు.
తాజాగా ప్రముఖ సింగర్ మధుప్రియ కూడా ఇద్దరు కంటెస్టెంట్లకు తన మద్దతు తెలిపింది. సింగర్ శ్రీరామచంద్రతో పాటు తన స్నేహితుడు మానస్‌కు ఓట్లేసి సేవ్ చేయండంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో వేడుకుంది. యాంకర్ సమీరా, కమెడియన్ అదిరే అభితో పాటు పలుబురు బుల్లితెర సెలబ్రిటీలు అతడికి మద్దతు పలుకుతున్నారు. అంతేకాదు రెడ్ హీరోయిన్ మాళవిక శర్మ సైతం మానస్‌కు అండగా నిలిచింది. 'మానస్ గురించి నేను చాలా విన్నాను. అతడు బిగ్‌బాస్ హౌస్‌లో ఇరగదీస్తున్నాడు. అందరూ అతడికి ఓటేస్తున్నారని ఆశిస్తున్నాను. నా ఓటు కూడా మానస్‌కే! అతడు తప్పకుండా గెలుస్తాడని కోరుకుంటున్నాను' అని చెప్పుకొచ్చింది మాళవిక. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.