singer madhu priya
-
మానస్ బిగ్‌బాస్ హౌస్‌లో ఇరగదీస్తున్నాడు: రెడ్ హీరోయిన్
Bigg Boss 5 Telugu, Malvika Sharma Supports Maanas: బిగ్‌బాస్ షో ముగింపుకు వచ్చేకొద్దీ సెలబ్రిటీలు వారి అభిమాన కంటెస్టెంట్‌ను గెలిపించడం కోసం బయట బాగానే కష్టపడుతున్నారు. కొందరు షో ప్రారంభం నుంచి సపోర్ట్ చేసుకుంటూ వస్తుంటే మరికొంతమంది ఫైనల్ ఎపిసోడ్‌కు రెండు వారాలే గడువు ఉన్న నేపథ్యంలో తమ మద్దతు ప్రకటిస్తున్నారు. తాజాగా ప్రముఖ సింగర్ మధుప్రియ కూడా ఇద్దరు కంటెస్టెంట్లకు తన మద్దతు తెలిపింది. సింగర్ శ్రీరామచంద్రతో పాటు తన స్నేహితుడు మానస్‌కు ఓట్లేసి సేవ్ చేయండంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో వేడుకుంది. యాంకర్ సమీరా, కమెడియన్ అదిరే అభితో పాటు పలుబురు బుల్లితెర సెలబ్రిటీలు అతడికి మద్దతు పలుకుతున్నారు. అంతేకాదు రెడ్ హీరోయిన్ మాళవిక శర్మ సైతం మానస్‌కు అండగా నిలిచింది. 'మానస్ గురించి నేను చాలా విన్నాను. అతడు బిగ్‌బాస్ హౌస్‌లో ఇరగదీస్తున్నాడు. అందరూ అతడికి ఓటేస్తున్నారని ఆశిస్తున్నాను. నా ఓటు కూడా మానస్‌కే! అతడు తప్పకుండా గెలుస్తాడని కోరుకుంటున్నాను' అని చెప్పుకొచ్చింది మాళవిక. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Maanas Nagulapalli (@maanasnagulapalli) -
మధుప్రియతో స్పెషల్ చిట్ చాట్
-
గాయని మధుప్రియ తండ్రి అరెస్టు
హైదరాబాద్: వర్ధమాన గాయని మధుప్రియ భర్త శ్రీకాంత్ అని భ్రమపడి మహ్మద్ నయీమ్ అనే వ్యక్తి పై దాడి కేసులో ఆమె తండ్రి పెద్ద మల్లేశ్ ను ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం మల్లేశ్ తో పాటు మరో ముగ్గురిని కూడా అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. కాగా గత శనివారం రాత్రి శ్రీకాంత్ అనుకుని రామాంతపూర్ కు చెందిన మహ్మద్ నయీమ్ (30) ని మధుప్రియ తండ్రి, బంధువులు చితకబాదారు. ఈ దాడిలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఈ మేరకు బాదితుడు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టిన పోలీసులు దాడి చేసిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. -
శ్రీకాంత్ మారితే ఆలోచిస్తా: మధుప్రియ
♦ కొలిక్కిరాని గాయని కేసు వ్యవహారం ♦ ఆరు గంటల పాటు కౌన్సిలింగ్ సాక్షి, హైదరాబాద్: గాయని మధుప్రియ దంపతుల వివాదం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. పెళ్లయిన మూడు నెలల నుంచే తనకు కట్నంగా ఆస్తి తీసుకురావాలంటూ భర్త శ్రీకాంత్ వేధింపులకు గురి చేశాడని మధుప్రియ హుమాయున్‌నగర్ పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం మధుప్రియతో పాటు ఆమె భర్త శ్రీకాం త్‌కు మానసిక వైద్యులు ఆరు గంటల పాటు కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రముఖ డాక్టర్ రాధిక, సైకాలజిస్ట్‌లు వసంత, శాంతితో పాటు ఆసిఫ్‌నగర్ పోలీస్ డివిజన్ ఏసీపీ గౌస్మొహియుద్దీన్, హుమాయూన్‌నగర్ ఇన్స్పెక్టర్ ఎస్.రవీందర్ నేతృత్వంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ కౌన్సిలింగ్ జరిగింది. ‘మధుప్రియ, భర్త శ్రీకాంత్‌కు వైవాహిక జీవితంలో ఎలాంటి విషయాలపై విభేదాలు వస్తున్నాయన్న విషయం తెలుసుకునే ప్రయత్నం చేశాం. మధుప్రియ మనసు కుదుటపడిన అనంతరం రెండోసారి కౌన్సిలింగ్ ఇస్తాం. అప్పటివరకు చట్టపరంగా ఎలాంటి చర్యలూ తీసుకోం’ అని ఆసిఫ్‌నగర్ ఏసీపీ గౌస్మొహియుద్దీన్ తెలిపారు. శ్రీకాంత్‌పై ఇప్పుడే చర్యలొద్దు: మధుప్రియ కౌన్సెలింగ్ అనంతరం మధుప్రియ మీడియాతో మాట్లాడుతూ... ‘శ్రీకాంత్ మంచోడే. అతడిపై ఇప్పుడే ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవద్దు. ప్రస్తుతం నా మానసిక పరిస్థితి బాగాలేదు. కౌన్సిలింగ్‌తో జీవితమంటే నాకో క్లారిటీ వచ్చింది. శ్రీకాంత్ మంచిగా మారితే రెండో కౌన్సిలింగ్‌కు వస్తా. అప్పటివరకు అమ్మానాన్నతోనే కలసి ఉంటా’ అన్నారు. ‘మధుప్రియను వేధించలేదు. ఎప్పటికైనా ఆమె నాతోనే ఉంటుంది. ఆమెతో ప్రశాంతంగా ఐదు నిమిషాలు కూడా వారి తల్లిదండ్రులు మాట్లాడించ లేదు’ అని శ్రీకాంత్ చెప్పారు. శ్రీకాంత్ నుంచి ప్రాణభయం: గాయని తండ్రి కాగా, ఆదివారం తెల్లవారుజామున శ్రీకాంత్ 15 మంది అనుచరులతో వచ్చి రామంతాపూర్‌లోని తమ ఇంటిపై ఇటుకలతో దాడి చేశాడని మధుప్రియ తండ్రి పెద్ద మల్లేశ్ ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీకాంత్ వల్ల తమ కుటుంబానికి ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు ఐపీసీ 147, 148, 506 సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. కాగా, మధుప్రియ కుటుంబసభ్యులే ఇంటికి పిలిపించి మరి తనను చితకబాదారని శ్రీకాంత్ సాక్షి టీవీ చర్చలో వెల్లడించారు. ఆమె తల్లి వల్లే ఈ గొడవలన్నీ అని చెప్పారు. ఇదే చర్చలో మధుప్రియ మాట్లాడుతూ... అసభ్య పదజాలంతో దూషించేవాడని, చేయి కూడా చేసుకున్న సందర్భాలు ఉన్నాయని ఆరోపించారు. -
మధుప్రియ వివాదంలో కొత్త ట్విస్ట్
హైదరాబాద్: వర్ధమాన గాయని మధుప్రియ వివాదంలో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.మధుప్రియను తన భర్త వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆదివారం పోలీసుల కౌన్సిలింగ్‌తో వివాదం సమసిపోయినట్టే కనిపిస్తోంది. కాగా, ఈ మొత్తం ఎపిసోడ్ మరో ఊహించని మలుపు తిరిగింది. శ్రీకాంత్ అని భ్రమపడి శనివారం అర్థరాత్రి మహ్మద్ నయీమ్ అనే వ్యక్తిని మధుప్రియ బంధువులు చితకబాదారు. రామంతాపూర్‌లోని మ్యాట్రిక్స్ ఆసుపత్రిలో ఆ యువకుడికి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు బాదితుడు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామంతాపూర్‌కు చెందిన మహ్మద్ నయీమ్ (30) అనే యువకుడు ప్రైవేట్ ఉద్యోగి. కొందరు గుర్తు తెలియని వక్తులు అతనిపై దాడి చేశారంటూ ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు. -
'ఏ రోజుకైనా మధుప్రియ నా వద్దకు వస్తుంది'
హైదరాబాద్: గాయని మధుప్రియ ఏ రోజుకైనా మళ్లీ తన దగ్గరికి వస్తుందని ఆమె భర్త శ్రీకాంత్ చెప్పాడు. మధుప్రియ మనసు సున్నితమని అన్నాడు. రెండు రోజుల తర్వాత వస్తానని చెప్పి గోదావరి ఖనికి వెళ్లిందని, ఆమె తల్లిదండ్రులకు వెళ్లిందని తెలిపాడు. తనకు, మధుప్రియకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారని శ్రీకాంత్ చెప్పాడు. ఈ సందర్భంగా మధుప్రియతో తనను ఏకాంతంగా మాట్లాడనివ్వలేదని తెలిపాడు. మూడు రోజుల్లో మరోసారి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని పోలీసులు చెప్పారని వెల్లడించాడు. శ్రీకాంత్ తనను వేధిస్తున్నాడని మధుప్రియ.. మధుప్రియ బంధువులు తనను కొట్టారని శ్రీకాంత్ పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో ఆదివారం హుమయున్ నగర్ పోలీస్ స్టేషన్‌కు వీరిద్దరినీ పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం మధుప్రియ మీడియాతో మాట్లాడుతూ.. రెండో కౌన్సెలింగ్ వరకు తల్లిదండ్రుల దగ్గరే ఉంటానని, ఆ తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని చెప్పింది. -
మా ఆయన మంచివాడు: మధుప్రియ
హైదరాబాద్: గాయని మధుప్రియ ప్రేమ పెళ్లి వివాదం డ్రామాకు 24 గంటల తర్వాత తాత్కాలికంగా తెరపడింది. హుమయూన్ నగర్ పోలీస్ స్టేషన్లో మధుప్రియ, శ్రీకాంత్ దంపతులకు పోలీసులు, మానసిక వైద్యుల సమక్షంలో 4 గంటల పాటు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ కౌన్సెలింగ్ అనంతరం ఇద్దరు ప్రస్తుతానికి రాజీకొచ్చినట్లు తెలుస్తోంది. మరో రెండు, మూడు రోజుల తర్వాత సెకండ్ కౌన్సెలింగ్ ఇచ్చే అవకాశం ఉందని పోలీసులు చెప్పారు. శ్రీకాంత్ కు అయిన గాయాల వివాదంపై మాట్లాడుతూ.. ఉప్పల్ పీఎస్ పరిధిలో ఈ కేసు ఉందని పేర్కొన్నారు. మధుప్రియ, శ్రీకాంత్ పూర్తిగా రాజీకొస్తారని భావిస్తున్నారా అని ఓ విలేకరి పోలీసులను ప్రశ్నించగా.. అది వారిద్దరికి సంబంధించిన వ్యవహారమని ఇప్పుడే ఏం చెప్పలేమన్నారు. రెండో కౌన్సెలింగ్ తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని సింగర్ మధుప్రియ చెప్పింది. అయితే, తనకు కొద్దిరోజుల సమయం కావాలని కోరినట్లు ఆమె పేర్కొంది. రెండో కౌన్సెలింగ్ పూర్తయ్యే వరకు తన తల్లితండ్రులతోనే ఉండబోతున్నట్లు వివరించింది. ప్రస్తుతం పోలీసులు ఇచ్చిన కౌన్సెలింగ్ తర్వాత శ్రీకాంత్ పై అభిప్రాయం అడగగా... 'హి ఈజ్ గుడ్' అంటూ మధుప్రియ చెప్పింది . మధుప్రియ వస్తానంటే తన ఇంటికి తీసుకెళ్లాడానికి తనకేమాత్రం అభ్యంతరం లేదని శ్రీకాంత్ అంటున్నాడు. అయితే, భవిష్యత్తులో ఆమె తల్లిదండ్రులు అనవసరంగా ఈ విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండాలని శ్రీకాంత్ చెప్పాడు. శనివారం అర్ధరాత్రి నుంచి ఒకరు మరొకరిపై కేసులు పెట్టుకున్న విషయం తెలిసిందే. తనను వేధిస్తున్నాడని మధుప్రియ, తనపై దాడి చేశారని శ్రీకాంత్ పరస్పరం ఫిర్యాదులు చేశారు. -
సింగర్ మధుప్రియ, శ్రీకాంత్‌లకు కౌన్సెలింగ్
హైదరాబాద్: సింగర్ మధుప్రియ, ఆమె భర్త శ్రీకాంత్‌కు ఆదివారం మధ్యాహ్నం హుమయున్ నగర్ పోలీస్‌స్టేషన్‌లో కౌన్సిలింగ్ నిర్వహించారు. పోలీసుల సమక్షంలో ఇద్దరికీ విడివిడిగా, కలిపి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఆదివారం ఉదయం శ్రీకాంత్ సాక్షి స్టూడియోకి వచ్చి మాట్లాడగా.. మధుప్రియ ఇంటి నుంచి మాట్లాడారు. పెళ్లి అయిన తర్వాత మూడు నెలలపాటు బాగానే చూసుకొన్న శ్రీకాంత్.. తనకు కట్నంగా ఆస్తి తీసుకురావాలంటూ వేధింపులకు గురి చేయడంతో పాటు ప్రతి రోజు తనను కొడుతున్నాడని సింగర్ మధుప్రియ ఆరోపణలు చేసింది. మధుప్రియ చేసిన ఆరోపణలు నిజమైతే తాను పీకను కోసుకుంటానని, ఉరిశిక్షకు సిద్ధమని, జైలుకు కూడా వెళ్తానని ఆమె భర్త శ్రీకాంత్ చెప్పాడు. ఆరు నెలల కిందట తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న సింగర్ మధుప్రియ.. తన భర్త శ్రీకాంత్ వేధిస్తున్నాడంటూ శనివారం రాత్రి హుమయున్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. -
'సెలబ్రిటీ అయి కూడా సమస్యలు ఎదుర్కొన్నా'
-
సెలబ్రిటీ అయి కూడా సమస్యలు ఎదుర్కొన్నా: మధుప్రియ
సెలబ్రిటీ స్టేటస్ ఉండి కూడా తాను ఇంట్లో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందని, అమ్మానాన్నలను ఒప్పించడానికి చాలావరకు ప్రయత్నించి, ఇక చేతకాక చేతులెత్తేసిన పరిస్థితుల్లోనే తాను శ్రీకాంత్‌ను పెళ్లి చేసుకున్నానని గాయని మధుప్రియ చెప్పింది. పెళ్లయిన తర్వాత తొలిసారిగా 'సాక్షి టీవీ'కి ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలను వెల్లడించింది. మధుప్రియ ఇంకా ఏం చెప్పిందంటే... మధుప్రియ ఇలా ఎందుకు చేస్తుంది అని అందరూ రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు ఏదైనా ఒక మేటర్ దొరికితే సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతోంది అయితే అమ్మాయిని బద్నాం చేసేముందు ఒక్కసారి ఆమె ఎందుకిలా చేయాల్సి వచ్చిందో ఆలోచించండి నాకు తెలిసి నేను చేసింది తప్పు కాదు అమ్మానాన్నలను చాలా రిక్వెస్ట్ చేశాను అంతకంటే ఎక్కువ అడగలేను అన్నంతగా రిక్వెస్ట్ చేసి, ఫలితం లేక చేతులెత్తేయాల్సి వచ్చింది అమ్మానాన్నలను నేను మోసం చేయలేదు, వారికి ద్రోహం చేయలేదు శ్రీకాంత్‌తో నాకు రెండేళ్ల నుంచి పరిచయం. న్యూ నల్లకుంటలో ఉండేవారు. మా ప్రేమ గురించి అమ్మానాన్నలకు ముందే చెప్పాను. ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చి కూడా ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాను తప్పని పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది కెరీర్‌ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు శ్రీకాంత్ ఫేమస్ కాదు.. మావాళ్లకు అతను పేద అబ్బాయి కదా అనే ఆలోచన ఉంది. నాకు మాత్రం అలాంటిదేమీ లేదు. మా అమ్మా, నాన్నల తర్వాత బాగా చూసుకోగలిగే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను, చేసుకున్నాను ప్రస్తుతం నేను ఎల్ఎల్బీ మొదటి సంవత్సరం చదువుతున్నాను. నా గోల్స్ ఏంటో శ్రీకాంత్‌కు కూడా తెలుసు. తను నాకు సపోర్ట్ చేస్తాడు కొన్నాళ్ల తర్వాత మళ్లీ అమ్మానాన్న మళ్లీ మాట్లాడుతారనే అనుకుంటున్నాను పెళ్లి చేసుకోవడం చాలా సంతోషం, అమ్మానాన్నలను వదులుకోవడం చాలా బాధాకరం భవిష్యత్తులో ఏం చేస్తానో నాకు తెలీదు. కాలానికే వదిలిపెడుతున్నాను లాయర్ అవుతానో లేదో మాత్రం అప్పుడే చెప్పలేను పెళ్లయిన తర్వాత కూడా నూటికి నూరుశాతం పాటలు పాడుతూనే ఉంటాను గడిచిన నెల రోజుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నాను అప్పటి నుంచి రెండువైపులా సమస్యలు వస్తూనే ఉన్నాయి అమ్మా నాన్న ఒప్పుకొంటే ఇంతవరకు వచ్చి ఉండేది కాదు మమ్మల్ని చంపేస్తామని కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయి నేను ముందే పోలీసుల దగ్గరకు రాలేదు.. పరిస్థితి బాగా ఇబ్బంది అయ్యాక కాగజ్‌నగర్ డీఎస్పీ వద్దకు వచ్చాను అమ్మానాన్నల మైండ్‌సెట్ వల్లనే నేను ఇలా మారాల్సి వచ్చింది