'ఏ రోజుకైనా మధుప్రియ నా వద్దకు వస్తుంది' | madhu priya to return to me, says srikanth | Sakshi
Sakshi News home page

'ఏ రోజుకైనా మధుప్రియ నా వద్దకు వస్తుంది'

Published Sun, Mar 13 2016 8:17 PM | Last Updated on Sun, Sep 3 2017 7:40 PM

'ఏ రోజుకైనా మధుప్రియ నా వద్దకు వస్తుంది'

'ఏ రోజుకైనా మధుప్రియ నా వద్దకు వస్తుంది'

హైదరాబాద్: గాయని మధుప్రియ ఏ రోజుకైనా మళ్లీ తన దగ్గరికి వస్తుందని ఆమె భర్త శ్రీకాంత్ చెప్పాడు. మధుప్రియ మనసు సున్నితమని అన్నాడు. రెండు రోజుల తర్వాత వస్తానని చెప్పి గోదావరి ఖనికి వెళ్లిందని, ఆమె తల్లిదండ్రులకు వెళ్లిందని తెలిపాడు. తనకు, మధుప్రియకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారని శ్రీకాంత్ చెప్పాడు. ఈ సందర్భంగా మధుప్రియతో తనను ఏకాంతంగా మాట్లాడనివ్వలేదని తెలిపాడు. మూడు రోజుల్లో మరోసారి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని పోలీసులు చెప్పారని వెల్లడించాడు.

శ్రీకాంత్ తనను వేధిస్తున్నాడని మధుప్రియ.. మధుప్రియ బంధువులు తనను కొట్టారని శ్రీకాంత్ పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో ఆదివారం హుమయున్ నగర్ పోలీస్ స్టేషన్కు వీరిద్దరినీ పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం మధుప్రియ మీడియాతో మాట్లాడుతూ..  రెండో కౌన్సెలింగ్ వరకు తల్లిదండ్రుల దగ్గరే ఉంటానని, ఆ తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని చెప్పింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement