గాయని మధుప్రియ తండ్రి అరెస్టు
హైదరాబాద్: వర్ధమాన గాయని మధుప్రియ భర్త శ్రీకాంత్ అని భ్రమపడి మహ్మద్ నయీమ్ అనే వ్యక్తి పై దాడి కేసులో ఆమె తండ్రి పెద్ద మల్లేశ్ ను ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం మల్లేశ్ తో పాటు మరో ముగ్గురిని కూడా అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
కాగా గత శనివారం రాత్రి శ్రీకాంత్ అనుకుని రామాంతపూర్ కు చెందిన మహ్మద్ నయీమ్ (30) ని మధుప్రియ తండ్రి, బంధువులు చితకబాదారు. ఈ దాడిలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఈ మేరకు బాదితుడు ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టిన పోలీసులు దాడి చేసిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.