humayun nagar
-
Hyderabad: ఫుడ్ డెలివరీ ఆలస్యమైందని దారుణం.. డెలివరీ బాయ్ వెంటపడి మరీ..
సాక్షి, హైదరాబాద్ : హుమయూన్‌నర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దుర్మార్గంగా ప్రవర్తించాడు. ఫుడ్ ఆర్డర్ ఆలస్యమైందని డెలివరీ బాయ్‌పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. తన అనుచరులు 15 మందితో కలిసి మాసబ్ ట్యాంక్‌లోని హోటల్ వద్దకు వచ్చాడు. వారితో కలిసి అక్కడ భయానక వాతావరణం సృష్టించాడు. భయంతో సదరు డెలివరీ బాయ్ హోటల్లోకి పరుగుతీశాడు. వారు కూడా అతన్ని వెంబడిస్తూ హోటల్లోకి పరుగెత్తి మరీ డెలివరీ బాయ్‌పై మూకుమ్మడిగా దాడి చేశారు. హోటల్ లోపలే అతడిని పట్టుకుని చితకబాదారు. హోటల్ సిబ్బంది గొడవను ఆపేందుకు ప్రయత్నించగా ఫలించలేదు. దాడి నుంచి తప్పించుకోవడానికి వంటగదిలోకి వెళ్లగా.. స్టౌమీద ఉన్న మరుగుతున్న నూనె మీద పడింది. దీంతో ఫుడ్ డెలివరీ బాయ్‌తో పాటు మరో ఇద్దరు హోటల్ సిబ్బందికి సైతం గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఫుడ్ డెలివరీ బాయ్ ఇలియాస్, హోటల్ ఉద్యోగులు సోను, సజ్జన్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు, అతని ముగ్గురు కుమారులు సహా ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడిన మరికొందరిని గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. -
కార్డన్ సెర్చ్: అదుపులో 9 మంది రౌడీషీటర్లు
హైదరాబాద్: హుమయున్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామున వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వర్రావు ఆధ్వర్యంలో సుమారు 400 మంది పోలీసులు ఆ ప్రాంతాన్నంతా జల్లెడ పట్టారు. ఈ సందర్భంగా 9 మంది రౌడీషీటర్లతో పాటు 51 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేనటువంటి 55 బైక్‌లు, 5 ఆటోలు, ఓ కారును పోలీసులు సీజ్ చేశారు. -
గాయని మధుప్రియ తండ్రి అరెస్టు
హైదరాబాద్: వర్ధమాన గాయని మధుప్రియ భర్త శ్రీకాంత్ అని భ్రమపడి మహ్మద్ నయీమ్ అనే వ్యక్తి పై దాడి కేసులో ఆమె తండ్రి పెద్ద మల్లేశ్ ను ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం మల్లేశ్ తో పాటు మరో ముగ్గురిని కూడా అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. కాగా గత శనివారం రాత్రి శ్రీకాంత్ అనుకుని రామాంతపూర్ కు చెందిన మహ్మద్ నయీమ్ (30) ని మధుప్రియ తండ్రి, బంధువులు చితకబాదారు. ఈ దాడిలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఈ మేరకు బాదితుడు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టిన పోలీసులు దాడి చేసిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. -
శ్రీకాంత్ మారితే ఆలోచిస్తా: మధుప్రియ
♦ కొలిక్కిరాని గాయని కేసు వ్యవహారం ♦ ఆరు గంటల పాటు కౌన్సిలింగ్ సాక్షి, హైదరాబాద్: గాయని మధుప్రియ దంపతుల వివాదం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. పెళ్లయిన మూడు నెలల నుంచే తనకు కట్నంగా ఆస్తి తీసుకురావాలంటూ భర్త శ్రీకాంత్ వేధింపులకు గురి చేశాడని మధుప్రియ హుమాయున్‌నగర్ పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం మధుప్రియతో పాటు ఆమె భర్త శ్రీకాం త్‌కు మానసిక వైద్యులు ఆరు గంటల పాటు కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రముఖ డాక్టర్ రాధిక, సైకాలజిస్ట్‌లు వసంత, శాంతితో పాటు ఆసిఫ్‌నగర్ పోలీస్ డివిజన్ ఏసీపీ గౌస్మొహియుద్దీన్, హుమాయూన్‌నగర్ ఇన్స్పెక్టర్ ఎస్.రవీందర్ నేతృత్వంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ కౌన్సిలింగ్ జరిగింది. ‘మధుప్రియ, భర్త శ్రీకాంత్‌కు వైవాహిక జీవితంలో ఎలాంటి విషయాలపై విభేదాలు వస్తున్నాయన్న విషయం తెలుసుకునే ప్రయత్నం చేశాం. మధుప్రియ మనసు కుదుటపడిన అనంతరం రెండోసారి కౌన్సిలింగ్ ఇస్తాం. అప్పటివరకు చట్టపరంగా ఎలాంటి చర్యలూ తీసుకోం’ అని ఆసిఫ్‌నగర్ ఏసీపీ గౌస్మొహియుద్దీన్ తెలిపారు. శ్రీకాంత్‌పై ఇప్పుడే చర్యలొద్దు: మధుప్రియ కౌన్సెలింగ్ అనంతరం మధుప్రియ మీడియాతో మాట్లాడుతూ... ‘శ్రీకాంత్ మంచోడే. అతడిపై ఇప్పుడే ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవద్దు. ప్రస్తుతం నా మానసిక పరిస్థితి బాగాలేదు. కౌన్సిలింగ్‌తో జీవితమంటే నాకో క్లారిటీ వచ్చింది. శ్రీకాంత్ మంచిగా మారితే రెండో కౌన్సిలింగ్‌కు వస్తా. అప్పటివరకు అమ్మానాన్నతోనే కలసి ఉంటా’ అన్నారు. ‘మధుప్రియను వేధించలేదు. ఎప్పటికైనా ఆమె నాతోనే ఉంటుంది. ఆమెతో ప్రశాంతంగా ఐదు నిమిషాలు కూడా వారి తల్లిదండ్రులు మాట్లాడించ లేదు’ అని శ్రీకాంత్ చెప్పారు. శ్రీకాంత్ నుంచి ప్రాణభయం: గాయని తండ్రి కాగా, ఆదివారం తెల్లవారుజామున శ్రీకాంత్ 15 మంది అనుచరులతో వచ్చి రామంతాపూర్‌లోని తమ ఇంటిపై ఇటుకలతో దాడి చేశాడని మధుప్రియ తండ్రి పెద్ద మల్లేశ్ ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీకాంత్ వల్ల తమ కుటుంబానికి ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు ఐపీసీ 147, 148, 506 సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. కాగా, మధుప్రియ కుటుంబసభ్యులే ఇంటికి పిలిపించి మరి తనను చితకబాదారని శ్రీకాంత్ సాక్షి టీవీ చర్చలో వెల్లడించారు. ఆమె తల్లి వల్లే ఈ గొడవలన్నీ అని చెప్పారు. ఇదే చర్చలో మధుప్రియ మాట్లాడుతూ... అసభ్య పదజాలంతో దూషించేవాడని, చేయి కూడా చేసుకున్న సందర్భాలు ఉన్నాయని ఆరోపించారు. -
మా ఆయన మంచివాడు: మధుప్రియ
హైదరాబాద్: గాయని మధుప్రియ ప్రేమ పెళ్లి వివాదం డ్రామాకు 24 గంటల తర్వాత తాత్కాలికంగా తెరపడింది. హుమయూన్ నగర్ పోలీస్ స్టేషన్లో మధుప్రియ, శ్రీకాంత్ దంపతులకు పోలీసులు, మానసిక వైద్యుల సమక్షంలో 4 గంటల పాటు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ కౌన్సెలింగ్ అనంతరం ఇద్దరు ప్రస్తుతానికి రాజీకొచ్చినట్లు తెలుస్తోంది. మరో రెండు, మూడు రోజుల తర్వాత సెకండ్ కౌన్సెలింగ్ ఇచ్చే అవకాశం ఉందని పోలీసులు చెప్పారు. శ్రీకాంత్ కు అయిన గాయాల వివాదంపై మాట్లాడుతూ.. ఉప్పల్ పీఎస్ పరిధిలో ఈ కేసు ఉందని పేర్కొన్నారు. మధుప్రియ, శ్రీకాంత్ పూర్తిగా రాజీకొస్తారని భావిస్తున్నారా అని ఓ విలేకరి పోలీసులను ప్రశ్నించగా.. అది వారిద్దరికి సంబంధించిన వ్యవహారమని ఇప్పుడే ఏం చెప్పలేమన్నారు. రెండో కౌన్సెలింగ్ తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని సింగర్ మధుప్రియ చెప్పింది. అయితే, తనకు కొద్దిరోజుల సమయం కావాలని కోరినట్లు ఆమె పేర్కొంది. రెండో కౌన్సెలింగ్ పూర్తయ్యే వరకు తన తల్లితండ్రులతోనే ఉండబోతున్నట్లు వివరించింది. ప్రస్తుతం పోలీసులు ఇచ్చిన కౌన్సెలింగ్ తర్వాత శ్రీకాంత్ పై అభిప్రాయం అడగగా... 'హి ఈజ్ గుడ్' అంటూ మధుప్రియ చెప్పింది . మధుప్రియ వస్తానంటే తన ఇంటికి తీసుకెళ్లాడానికి తనకేమాత్రం అభ్యంతరం లేదని శ్రీకాంత్ అంటున్నాడు. అయితే, భవిష్యత్తులో ఆమె తల్లిదండ్రులు అనవసరంగా ఈ విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండాలని శ్రీకాంత్ చెప్పాడు. శనివారం అర్ధరాత్రి నుంచి ఒకరు మరొకరిపై కేసులు పెట్టుకున్న విషయం తెలిసిందే. తనను వేధిస్తున్నాడని మధుప్రియ, తనపై దాడి చేశారని శ్రీకాంత్ పరస్పరం ఫిర్యాదులు చేశారు. -
సింగర్ మధుప్రియ, శ్రీకాంత్‌లకు కౌన్సెలింగ్
హైదరాబాద్: సింగర్ మధుప్రియ, ఆమె భర్త శ్రీకాంత్‌కు ఆదివారం మధ్యాహ్నం హుమయున్ నగర్ పోలీస్‌స్టేషన్‌లో కౌన్సిలింగ్ నిర్వహించారు. పోలీసుల సమక్షంలో ఇద్దరికీ విడివిడిగా, కలిపి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఆదివారం ఉదయం శ్రీకాంత్ సాక్షి స్టూడియోకి వచ్చి మాట్లాడగా.. మధుప్రియ ఇంటి నుంచి మాట్లాడారు. పెళ్లి అయిన తర్వాత మూడు నెలలపాటు బాగానే చూసుకొన్న శ్రీకాంత్.. తనకు కట్నంగా ఆస్తి తీసుకురావాలంటూ వేధింపులకు గురి చేయడంతో పాటు ప్రతి రోజు తనను కొడుతున్నాడని సింగర్ మధుప్రియ ఆరోపణలు చేసింది. మధుప్రియ చేసిన ఆరోపణలు నిజమైతే తాను పీకను కోసుకుంటానని, ఉరిశిక్షకు సిద్ధమని, జైలుకు కూడా వెళ్తానని ఆమె భర్త శ్రీకాంత్ చెప్పాడు. ఆరు నెలల కిందట తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న సింగర్ మధుప్రియ.. తన భర్త శ్రీకాంత్ వేధిస్తున్నాడంటూ శనివారం రాత్రి హుమయున్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. -
చోరీ చేస్తూ దొరికారు
హైదరాబాద్ సిటీక్రైం: హుమాయూన్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్యశ్రీ ఆర్కేడ్‌లో దొంగతనం జరిగింది. శనివారం ఉదయం 3.30 గంటల ప్రాంతంలో సత్యసాయి ఆర్కేడ్‌లోకి ప్రవేశించిన ఇద్దరు దుండగులు ఒక ఫ్లాట్‌లో దొంగతనం చేసి, మరో ఫ్లాట్‌లోకి ప్రవేశించి చోరీకి యత్నిస్తుండగా చుట్టుపక్కల వారు అప్రమత్తమై వారిని పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం అందించటంతో వారు వచ్చి దొంగలిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. చోరీ వివరాలు తెలియాల్సి ఉంది. -
గండిపేట చెరువులో ముగ్గురు యువకుల గల్లంతు
హైదరాబాద్ : ఈత సరదా ముగ్గురి ప్రాణాలు తీసింది. హైదరాబాద్ గండిపేట చెరువులోకి స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందారు. మృతులు హుమాయున్ నగర్‌కు చెందిన అబ్దుల్, సల్మాన్, సతీష్లుగా గుర్తించారు. దీంతో మృతుల నివాసాల్లో విషాదం నెలకొంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.