Bigg Boss Telugu 5: Priyanka Stop Using Maanas Trending On Twitter - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 5: ప్రియాంకపై ట్రోలింగ్‌, నిజంగానే వెన్నుపోటు పొడిచిందా!

Published Sat, Nov 13 2021 3:48 PM | Last Updated on Wed, Nov 17 2021 1:00 AM

Bigg Boss Telugu 5: Priyanka Stop Using Maanas Trending On Twitter - Sakshi

Bigg Boss Telugu 5, Priyanka Stop Using Maanas: ఎప్పుడూ గొడవలతో ఊగిపోయే కంటెస్టెంట్లు సైలెంట్‌గా ఉన్నారేంటి అనుకునేలోపే హౌస్‌మేట్స్‌ అందరూ విశ్వరూపం చూపించారు. ఒక్క కెప్టెన్సీ టాస్క్‌లోనే యానీ- కాజల్‌, సిరి, షణ్ను- సన్నీ, రవి- మానస్‌ గొడవపడ్డారు. ఈ కొట్లాటల తర్వాత వీళ్లెలా ఉన్నారో తెలియదు గానీ అభిమానులు మాత్రం ఆవేశంతో ఊగిపోతున్నారు. మా అభిమాన కంటెస్టెంట్‌ చేసింది కరెక్ట్‌ అంటూ ఎవరి ఫ్యాన్స్‌ వాళ్లకు సపోర్ట్‌ చేస్తున్నారు. సపోర్ట్‌ చేయడంలో తప్పు లేదు కానీ అవతలి కంటెస్టెంట్‌ మీద విరుచుకుపడుతూ నానా మాటలు అంటున్నారు.

పింకీ వెన్నుపోటు పొడిచిందా?
దీంతో నిన్నటి నుంచి సన్నీ, షణ్నుల పేర్లు సోషల్‌ మీడియాలో మార్మోగిపోతున్నాయి. వీళ్ల ఫ్యాన్స్‌ ఒకరినొకరు దూషించుకుంటూ నెట్టింట రచ్చరచ్చ చేస్తున్నారు. ఇదిలా వుంటే నిన్నటి టాస్క్‌లో ప్రియాంక వల్ల సన్నీ కెప్టెన్సీ కోల్పోయాడని చాలామంది వాదిస్తున్నారు. ప్రియాంక చీర తగిలే రెండుసార్లు అతడి టవర్‌ కూలిపోయింది. దీంతో మానస్‌ కూడా పింకీపై అనుమానం వ్యక్తం చేశాడు. ఒకసారంటే ఏదో అనుకోకుండా జరిగిందనుకోవచ్చు, కానీ రెండుసార్లు ఎలా సాధ్యమని సందేహపడ్డాడు. తను కావాలనే చేసినట్లు అనిపిస్తోందని మానస్‌, సన్నీ అభిప్రాయపడ్డారు. నమ్మినవాళ్లే వెన్నుపోటు పొడిస్తే ఎలా? అని సన్నీ బాధపడ్డాడు. ఇక పింకీ వల్ల మానస్‌ గ్రాఫ్‌ కూడా పడిపోతుందని ఆయన ఫ్యాన్స్‌ ఆగ్రహంతో ఉన్నారు.

మానస్‌కు ఆ వీడియో చూపించాల్సిందే
దీంతో మానస్‌ను వదిలెయ్‌ ప్రియాంక(#PriyankaStopUsingMaanas) అన్న హ్యాష్‌ట్యాగ్‌ ట్విటర్‌లో వైరల్‌గా మారింది. మానస్‌ ఆటను పింకీ సర్వనాశనం చేస్తోందంటూ ఆమెను దుమ్మెత్తిపోస్తున్నారు. కెప్టెన్సీ టాస్క్‌లో కావాలనే తన తనలతో టవర్‌ కూలిపోయేలా చేసి సన్నీకి నమ్మకద్రోహం చేసిందని విమర్శిస్తున్నారు. ఈ వీడియోను బిగ్‌బాస్‌ సన్నీ, మానస్‌లకు చూపించి వారి కళ్లు తెరిపించాలని కోరుకుంటున్నారు. అయితే ప్రియాంక అభిమానులు మాత్రం మానస్‌ను ఎంతో ప్రేమించే పింకీ అతడి నమ్మకాన్ని వమ్ము చేయదంటున్నారు. అనుకోకుండా జరిగిన పొరపాటుకు ఆమెను అనుమానించి కించపరచొద్దని కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement