
Bigg Boss Telugu 5 Grand Finale, Maanas, Siri Eliminated From BB House: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌కు శుభం కార్డు పలికే సమయం ఆసన్నమైంది. ట్రోఫీ ఎవరి వశం అవుతుందనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. ఇప్పటికే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌ను కనీవినీ ఎరగని రీతిలో ప్లాన్ చేశారు నిర్వాహకులు. టాలీవుడ్ నుంచి స్టార్ సెలబ్రిటీలను స్పెషల్ గెస్టులుగా తీసుకొస్తుండటంతో పాటు బాలీవుడ్ స్టార్లను సైతం రంగంలోకి దింపారు. ఇక హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల డ్యాన్సులు, హంగామా ఉండనే ఉంటుంది.
తాజాగా అందిన సమాచారం ప్రకారం మానస్, సిరి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారట! కంటెస్టెంట్ల డ్యాన్సులతో పాటు ఫైనలిస్టుల్లో నుంచి ఇద్దరిని ఎలిమినేట్ చేసే ప్రక్రియను ఒకరోజు ముందుగానే అంటే శనివారమే షూట్ చేశారు. ఈ క్రమంలో టైటిల్ రేసు నుంచి మొదటగా సిరి తప్పుకుందని లీకువీరులు సోషల్ మీడియాలో చాటింపు వేశారు. తర్వాత నాలుగో స్థానంలో మానస్ ఎలిమినేట్ అయినట్లు పేర్కొన్నారు. డైరెక్టర్ సుకుమార్ డ్రోన్ల ద్వారా సిరి ఎలిమినేషన్‌ను ప్రకటించగా హీరోయిన్ సాయిపల్లవి చేతుల మీదుగా మానస్ ఎలిమినేషన్‌ను వెల్లడించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు లీకువీరులు చెప్పిన ప్రతీది నిజమవుతూ వస్తుండటంతో ఈ ఎలిమినేషన్స్ కూడా నిజమయ్యే ఉంటుందని నమ్ముతున్నారు ఆడియన్స్.
పైగా అనధికారిక ఓటింగ్‌లోనూ మానస్, సిరి చివరి రెండు స్థానాల్లో ఉన్నారు. ఐదో స్థానంలో ఉన్నప్పుడు సిరి, నాలుగో స్థానంలో ఉన్నప్పుడు మానస్ ఎలిమినేట్ అవుతారని అందరూ అంచనా వేశారు. ఇప్పుడదే నిజమైనట్లు కనిపిస్తోంది. కాకపోతే మానస్ హౌస్‌లో ఉన్నప్పుడు బిగ్‌బాస్ రూ.10 లక్షలు ఆఫర్ చేయగా దాన్ని తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదని తెలుస్తోంది. మరి ఈ ఆఫర్‌ను రెట్టింపు చేస్తే టాప్ 3లో ఉన్న షణ్ను, సన్నీ, శ్రీరామ్‌లలో ఎవరు తీసుకునే అవకాశం ఉందనేది ఫినాలేలో తేలనుంది!
Comments
Please login to add a commentAdd a comment