
Bigg Boss Telugu 5 Unseen: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌లో మరో ఎలిమినేషన్ జరగబోతోంది. ఈ 12వ వారం ఎవరు ఎలిమినేట్ కానున్నారనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. కాజల్, సిరి, ప్రియాంక సింగ్‌లలో ఎవరు హౌస్‌ను వీడనున్నారనేది రేపు తేలనుంది. అయితే ఈ వారం తాను వెళ్లిపోవడం ఖాయం అని ముందే ఫిక్సైపోయింది పింకీ.
అన్‌సీన్ వీడియోలో మానస్ దగ్గరకు వెళ్లి కూర్చున్న ప్రియాంక.. ఈ వీక్ నేను వెళ్లిపోతే ప్రతిరోజూ బొట్టు పెట్టుకుని పడుకోమని సూచించింది. అలాంటి సెంటిమెంట్స్ లేవని తెలుసు కదా, ఏదో నువ్వు పెడతావని పెట్టుకుంటున్నా అంతేనని మానస్ సమాధానమివ్వగా మరి మొన్నెందుకు పెట్టుకున్నావని కూపీ లాగింది. సమయానికి భోజనం చేయు, బట్టలు ఎప్పటికప్పుడు ఉతికేసుకో, రెండు రోజులకొకసారి తలకు నూనె పెట్టుకో అని మానస్‌కు ఏమేం చేయాలో లిస్టు చెప్పుకురాసాగింది.
ఆమె మాటలను మధ్యలో అడ్డుకున్న అతడు నువ్వు ఏం వెళ్లిపోవులే అని సముదాయించాడు. అయితే పింకీ మాత్రం నేను వెళ్తానని ఫిక్సయ్యాను అని కరాఖండిగా తేల్చేసింది. ఎందుకు? హౌస్‌లో ఇప్పటికే చాలా రోజులు ఎక్కువ ఉండిపోయాననుకుంటున్నావా? అని మానస్ మధ్యలో పంచ్ వేశాడు. మరి ప్రియాంక ఊహించిందే నిజమవుతుందా? ట్రోఫీ గెలవాలన్న కల కలగానే మిగిలిపోనుందా? అన్నది చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment