
చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన మానస్ బుల్లితెరపైనా సత్తా చాటాడు. బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌లో ఎంట్రీ ఇచ్చి మరింత పాపులర్ అయ్యాడు. గేమ్ పరంగానే కాకుండా మెచ్యూర్డ్ థింకింగ్‌తో అటు కుటుంబ ప్రేక్షకుల్ని, ఇటు యువతని అమితంగా ఆకట్టుకున్నాడు. సీరియల్స్, సాంగ్స్, సినిమాలు చేస్తున్న మానస్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. శ్రీజ నిశ్శంకర్ రావుతో పెళ్లికి రెడీ అయ్యాడు.
తాజాగా వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. కాబోయే భార్య మెడలో పూల మాల వేసి మురిసిపోయాడు మానస్. ఆమెతో కలిసి నడుస్తూ.. నిండునూరేళ్లు కలిసి ప్రయాణించబోతున్నామని చెప్పకనే చెప్పాడు. ఈ ఎంగేజ్‌మెంట్ వేడుకకు తన బెస్ట్‌ఫ్రెండ్స్ కాజల్, సన్నీ కూడా హాజరైనట్లు తెలుస్తోంది. ఈమేరకు పలు ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment