వాలంటైన్స్ డే దగ్గర పడుతోంది. సింగిల్స్ ప్రపోజ్ చేయడానికి రెడీ అవుతుంటే అదే సింగిల్స్ కొందరు మాత్రం లవ్వు లేదు, గివ్వు లేదు.. లవ్వంటే ఇంట్రస్ట్ లేదంటూ పాటలు పాడుకుంటూ కాలం గడిపేస్తున్నారు. బ్రేకప్ అయిన వాళ్ల సంగతి సరేసరి.. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వాటిని ఎలా మర్చిపోవాలా? అని వేదన అనుభవిస్తున్నారు. యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో సాడ్ సాంగ్స్ పెట్టుకుంటూ బ్రేకప్ హార్ట్ ఎమోజీని జత చేస్తూ తన బాధను చెప్పకనే చెప్తున్నాడు. ఇది చూసిన అతడి సోదరుడు సంపత్ వినయ్.. 'ఫస్టూ చదువుకోండి.. ఈ ఏజ్‌లో లవ్ ఎందుకు?' అని రిప్లై ఇచ్చాడు. దీంతో షణ్నూ నా బాధ నీకేం తెలుసు అన్నట్లుగా ఓ ఎమోజీ పెట్టాడు. బిగ్‌బాస్ కంటెస్టెంట్ మానస్ అయితే 'హ్యాపీ ప్రపోజ్ డే' అంటూ షణ్నూని మరింత ఉడికించాడు. 'హుష్, తప్పు తప్పుగా మాట్లాడొద్దు మా సింగిల్స్ దగ్గర' అని రిప్లై ఇవ్వగా 'హలో నేను కూడా సింగిలే..' అని బదులిచ్చాడు మానస్.
Comments
Please login to add a commentAdd a comment