బిగ్‌బాస్ ఫేమ్, నటుడు మానస్ గుడ్‌న్యూస్ చెప్పాడు. త్వరలోనే తండ్రిని కాబోతున్నట్లు వెల్లడించాడు. భార్య శ్రీజ ప్రస్తుతం గర్భిణి అన్న విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా మా మనసులు పర్ఫెక్ట్‌గా కలిశాయి. ఇప్పుడు మా కుటుంబంలోకి ఓ బుజ్జాయి రాబోతున్నందుకు సంతోషంగా ఉంది. బేబీ నాగులపల్లి వచ్చేస్తున్నాడు అంటూ శ్రీజ బేబీ బంప్ ఫోటో షేర్ చేశాడు.
వారం రోజుల క్రితమే శ్రీజకు ఘనంగా సీమంతం కూడా చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరలయ్యాయి. ఇకపోతే గతేడాది నవంబర్‌లో చెన్నైకి చెందిన శ్రీజను మానస్ పెళ్లి చేసుకున్నాడు. నెల తిరిగేలోపు కొత్త కారు కూడా కొన్నాడు. ఇప్పుడు ఏడాది తిరగకముందే శ్రీజ గర్భం దాల్చిందన్న గుడ్ న్యూస్ చెప్పాడు.
కాగా మానస్.. కాయ్ రాజా కాయ్, ప్రేమికుడు తదితర చిత్రాల్లో హీరోగా నటించాడు. తెలుగు బిగ్‌బాస్ ఐదో సీజన్‌లో పాల్గొని టాప్ 5 ఫైనలిస్టుల్లో ఒకరిగా నిలిచాడు. బ్రహ్మముడి సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
చదవండి: 23 కిలోలు తగ్గా.. అప్పటినుంచే ఎక్కువ ఆఫర్లు: బాలీవుడ్ నటి
Comments
Please login to add a commentAdd a comment