
Maanas Mother Comments On Pinky Marriage: 'దేవుడు నాకు మంచి లైఫ్ ఇచ్చి ఉంటే బాగుండేది. అప్పుడు నీతో హ్యాపీగా ఉండేదాన్ని' అంటూ అర్ధరాత్రి తన బాధను మానస్‌తో చెప్పుకుంటూ బాధపడింది ప్రియాంక సింగ్. రోజురోజుకీ అతడి మీద ప్రేమను పెంచుకుంటూ, అతడి గురించే ఆలోచిస్తూ కాలం గడిపేస్తోంది పింకీ. ఆమె పరిస్థితి చూసి అభిమానులు కలవరపడుతున్నారు. బిగ్‌బాస్ తర్వాత రోజూ మానస్‌తో ఉండలేవు, తరచూ మాట్లాడే అవకాశం ఉండదు, అసలు అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా తెలీదని అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా వుంటే ఓ ఇంటర్వ్యూలో మానస్ తల్లి పద్మిని.. ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'ఆమె చాలా మంచి అమ్మాయి, నాకెంతో ఇష్టం. ఓసారి ప్రియాంక.. మానస్‌ను హజ్బెండ్ మెటీరియల్ అంది. కానీ, మానస్ ఆమె కేవలం మరదలని చెప్పాడు. బిగ్‌బాస్ అనేది 110 రోజుల ఆట. ఈ షోలో ఎంతమంది జంటలు బయటకొచ్చారు? ఎంతమంది పెళ్లిళ్లు చేసుకున్నారు? ఏదైనా బిగ్‌బాస్ షో వరకే అని అందులో ఉన్న కంటెస్టెంట్లకు బాగా తెలుసు. కాకపోతే హౌస్‌లో ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఎలా ఉంటారు? ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటారు. హౌస్‌లో మానస్‌కు ఎవరూ సెట్ కారు. నేను ఎవర్ని వేలు పెట్టి చూపిస్తే మానస్ ఆమెనే పెళ్లి చేసుకుంటాడు. ప్రియాంక సింగ్.. నా కొడుకును పెళ్లి చేసుకుంటానంటే మాత్రం ఒప్పుకోను. ఆమెను తగిన అబ్బాయిని చూపించి పెళ్లి చేస్తా. అలా ప్రియాంకకు నేను సపోర్ట్ చేస్తాను, ఏదైనా సాయం చేస్తాను అని చెప్పింది.
ఇక మానస్ ఫస్ట్ లవ్ గురించి మాట్లాడుతూ.. అతడు చదువుతున్న సమయంలో ప్రేమించిన అమ్మాయి అమెరికా వెళ్లిపోవడానికి రెడీ అయింది. దీంతో ఏం చేయాలని నన్ను అడిగాడు. నీదింకా చిన్న వయసు. కరెక్ట్‌గా సెటిల్ అవకుండా అమెరికా వెళ్లడం కరెక్ట్ కాదేమోనన్నాను. మానస్ సరేనని ఆగిపోయాడు. అలా కెరీర్ మీద ఫోకస్ పెట్టాడు అని పేర్కొంది పద్మిని.
(చదవండి: బిగ్‌బాస్ హౌస్‌లో అతడు హీరో, ఆమె విలన్!)
Comments
Please login to add a commentAdd a comment