పెళ్లిబంధంతో ఒక్కటైన బ్రహ్మముడి సీరియల్ నటుడు..! | Serial Actor And Bigg Boss Fame Maanas Marriage In Vijayawada, Video Trending On Social Media - Sakshi
Sakshi News home page

Bigg Boss Maanas Marriage Video: వివాహా బంధంలోకి అడుగుపెట్టిన బిగ్‌ బాస్‌ నటుడు..!

Published Thu, Nov 23 2023 3:08 PM | Last Updated on Thu, Nov 23 2023 3:42 PM

Serial Actor Bigg Boss Fame Maanas Marriage In Vijayawada Goes Viral - Sakshi

బిగ్‏బాస్ ఫేమ్, నటుడు మానస్  వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. హల్దీ వేడుకతో మొదలైన పెళ్లి వేడుకలు మూడు రోజుల పాటు విజయవాడలోని ఓ రిసార్ట్స్ వేదికగా ఘనంగా జరిగాయి.  చెన్నైకు చెందిన శ్రీజ అనే అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేశారు. ఈ పెళ్లికి ఇరువర్గాల కుటుంబసభ్యులు, నటీనటులు, ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. ఈ జంట సెప్టెంబర్ 2న నిశ్చితార్థం చేసుకున్నారు.

(ఇది చదవండి: ఓటీటీలోకి 'భగవంత్ కేసరి' సినిమా.. రిలీజ్ డేట్ ఫిక్స్?)

కాగా.. కోయిలమ్మ అనే సీరియల్ ద్వారా మానస్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత పలు సీరియల్స్‌లో నటించారు. ఆ తర్వాత బిగ్‏బాస్ సీజన్ -5లో ఫైనలిస్ట్‌గా నిలిచాడు.  ప్రస్తుతం బ్రహ్మాముడి సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవలే బిగ్ బాస్‌ సీజన్‌-7లో కంటెస్టెంట్‌గా ఉన్న తన ఫ్రెండ్‌ అమర్‌దీప్‌ కోసం వచ్చిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement