Rochelle Rao-Keith Sequeira announce pregnancy, to become parents after 5 years - Sakshi
Sakshi News home page

Rochelle Rao: బిగ్‌ బాస్ బ్యూటీకి ప్రెగ్నెన్సీ.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్!

Published Wed, Aug 2 2023 9:11 PM | Last Updated on Wed, Sep 6 2023 10:13 AM

Rochelle Rao and Keith Announce Pregnancy 5 Years After Marriage - Sakshi

బిగ్ బాస్ జంట రోషెల్ రావ్, కీత్ సిక్వేరా అభిమానులకు గుడ్‌ న్యూస్ చెప్పారు. త్వరలోనే తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. గతంలో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌గా పాల్గొన్న ఈ జంట మొదటి బిడ్డను స్వాగతించేందుకు ఎదురుచూస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  రోషెల్ రావు బేబీబంప్‌తో ఉన్న ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి. ఈ విషయం తెలుసుకున్న పలువురు తారలు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. 

(ఇది చదవండి: 'ఒక రేంజ్ తర్వాత మనదగ్గర మాటలుండవ్.. కోతలే'.. ఆసక్తి పెంచుతోన్న ట్రైలర్)

రోచెల్ రావు ఇన్‌స్టాలో రాస్తూ..' "రెండు చిన్న చేతులు, రెండు చిన్న పాదాలు, మా బిడ్డను కలుసుకోవడానికి ఇక వేచి ఉండలేము! ఈ అద్భుతమైన బహుమతికి, మీ అంతులేని ప్రేమ, మద్దతు కోసం మీ అందరికీ ధన్యవాదాలు. ఈ కొత్త ప్రయాణంలో మీ అందరీ ఆశీర్వాదం కావాలి. కీత్ అండ్ రోషెల్ + వన్" అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ వార్త తెలిసిన వెంటనే భారతీ సింగ్, సుగంధ మిశ్రా, కిష్వెర్ మర్చంట్, అర్చన పురాణ్ సింగ్,  సనా మక్బుల్ వంటి పలువురు ప్రముఖులు ఈ జంటను అభినందించారు.

కీత్, రోషెల్  ప్రేమకథ

కాగా.. కీత్, రోషెల్ ముంబైలోని ఒక చర్చిలో కలుసుకున్నారు. ఆ తర్వాత వారు స్నేహితులుగా కొనసాగారు. అనంతరం కొన్ని నెలలపాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట.. ఆ తర్వాత మాల్దీవులలో వివాహం చేసుకున్నారు. కీత్, రోషెల్ బిగ్ బాస్- 9లో కంటెస్టెంట్స్‌గా కనిపించారు. ఆ తర్వాత వారు నాచ్ బలియే సీజన్-9లోనూ పాల్గొన్నారు. కాగా.. కీత్ అంతకుముందే మాజీ నటి సంయుక్త సింగ్‌ను 2005లో వివాహం చేసుకోగా.. విభేదాల కారణంగా 2011లో విడిపోయారు. రోచెల్ ది కపిల్ శర్మ షోలో కనిపించినందుకు బాగా ఫేమ్ తెచ్చుకుంది. కీత్ దేఖో మగర్ ప్యార్ సే, దియా ఔర్ బాతీ హమ్, డోలీ అర్మానో కీ, దిల్ హి తో హై లాంటి టీవీ షోలలో కనిపించింది. 

(ఇది చదవండి: సెన్సార్‌ పూర్తి చేసుకున్న మెగాస్టార్ భోళాశంకర్..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement