బాలీవుడ్ నటి నేహా ధూపియా బీ టౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. 2002లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న భామ ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో తరుణ్ హీరోగా నటించిన నిన్నే ఇష్టపడ్డాను చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో కనిపించింది. తెలుగులో విలన్, పరమవీర చక్ర సినిమాల్లో కనిపించింది. గతేడాది ఏ థర్స్‌డే అనే చిత్రంలోనూ నటించింది. అయితే తాజాగా ఓ ఆన్ లైన్ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తన పెళ్లికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
(ఇది చదవండి: రామ్ గోపాల్ వర్మ నన్ను మోసం చేశాడు: బాలీవుడ్ నటుడు)
అయితే బాలీవుడ్ నటుడైన అంగద్ బేడీని మే 2018లో నేహా ధూపియా ప్రేమ పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లయిన కొద్ది నెలలకే ఓ బిడ్డకు కూడా జన్మినిచ్చారు. దీంతో తమపై చాలా సార్లు ట్రోల్స్ వచ్చినా కూడా వాటిని పట్టించుకోలేదని తెలిపింది. అయితే ఈ విషయాన్ని పెళ్లికి ముందే తమ కుటుంబ సభ్యులకు చెప్పినట్లు వెల్లడించింది.
(ఇది చదవండి: నాగార్జున మేనకోడలితో యంగ్ హీరో అడివి శేష్ పెళ్లి..!)
72 గంటల్లోనే పెళ్లి: నేహా
గర్భం ధరించిన విషయం కుటుంబ సభ్యులకు తెలపడంతో పెళ్లికి కేవలం 72 గంటల సమయమే ఇచ్చారని నేహా తెలిపింది. దీంతో ముంబయిలో కేవలం సన్నిహితులు, బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకున్నట్లు వివరించింది. అయితే ప్రెగ్నెన్నీ విషయం బయటకు చెప్పేందుకు తాము చాలా ఉద్వేగానికి లోనయ‍్యామని వివరించింది. కాగా.. 2018లో ఒక్కటైన ఈ జంటకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment