Bigg Boss 5 Telugu 14th Week Elimination Prediction In Telugu: Kajal, Siri In Danger Zone - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 5 Elimination: ఆ ఇద్దరికీ ఎలిమినేషన్‌ గండం, బిగ్‌బాస్‌ షోకు గుడ్‌బై చెప్పేదెవరు?

Published Thu, Dec 9 2021 8:09 PM | Last Updated on Sun, Dec 12 2021 5:58 PM

Bigg Boss 5 Telugu 14th Week Elimination: Kajal, Siri In Danger Zone - Sakshi

Bigg Boss 5 Telugu, 14th Week Elimination: ఒక్క ఎలిమినేషన్‌.. ఒకే ఒక్క ఎలిమినేషన్‌తో తెలుగు బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో టాప్‌ 5లో ఎవరుంటారన్నది తేలిపోనుంది. ఇప్పటివరకు జరిగిన ఎలిమినేషన్స్‌లో కొన్ని మాత్రమే ట్విస్టులుండగా మిగతావన్నీ ఊహించినవే నిజమయ్యాయి! కానీ ఈ వారం మాత్రం ఎవరు హౌస్‌ను వీడనున్నారు? అన్నది చెప్పడం కొంత క్లిష్టంగా మారింది! టికెట్‌ టు ఫినాలే అందుకున్న శ్రీరామ్‌ మినహా సిరి, షణ్ను, సన్నీ, మానస్‌, కాజల్‌.. ఐదుగురూ నామినేషన్స్‌లో ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్‌ అయ్యే ఛాన్స్‌ ఉందో చూద్దాం..

అనధికారిక పోలింగ్స్‌లో షణ్ను, సన్నీలకు భారీ ఎత్తున ఓట్లు నమోదవుతున్నాయి. వీళ్ల ఫాలోయింగ్‌ చూస్తుంటే ఇద్దరూ టైటిల్‌ కోసం పోటీపడేలా ఉన్నారు.. కాబట్టి వీళ్లు ఎలిమినేట్‌ అవుతారన్న సందేహమే అవసరం లేదు. కానీ వీళ్లిద్దరి వల్ల మిగతావారి ఓటింగ్‌ జాతకాలు మారుతున్నట్లు కనిపిస్తోంది. సిరిని మానసికంగా వేధిస్తున్నాడంటూ షణ్ముఖ్‌పై ఈ వారం విపరీతమైన నెగెటివిటీ పెరిగిపోయింది. షణ్ను ప్రవర్తన వల్ల సిరి కూడా డిస్టర్బ్‌ అయినట్లు కనిపిస్తోంది. అందరికీ ఇచ్చిపడేసే సిరి షణ్ను తనను కంట్రోల్‌ చేస్తున్నా నిమ్మకు నీరెత్తనట్లు ఉండటంతో ఆమె మీద కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆమె ఓట్లకు గండి పడుతున్నట్లు తెలుస్తోంది.

టాస్కుల్లో 100 % ఇచ్చే మానస్‌కు బాగానే ఓట్లు పడుతున్నాయి. ఎటొచ్చీ సిరి, కాజల్‌ తక్కువ ఓట్లతో చివరి రెండు స్థానాల్లో ఉన్నట్లు కనిపిస్తోంది. అంటే 14వ వారం ఈ ఇద్దరూ డేంజర్‌ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ఈ వారం కూడా ఒక లేడీ కంటెస్టెంట్‌ బయటకు వెళ్లిపోయే అవకాశం ఉంది. కానీ బిగ్‌బాస్‌ వాళ్లిద్దరినీ ఫినాలేకు పంపాలనుకుంటే మాత్రం మానస్‌కు గుడ్‌బై చెప్పే ఛాన్స్‌ ఉంది. 

మానస్‌, కాజల్‌లో ఎవరు ఎలిమినేట్‌ అయినా అది సన్నీకి ప్లస్‌ అవుతుంది. బయట నుంచి వారి ఫ్యాన్స్‌ సపోర్ట్‌తో మరిన్ని ఓట్లు సన్నీకి పడతాయి. లేదంటే వాళ్లిద్దరూ కూడా ఫినాలేలో అడుగుపెడితే మాత్రం సన్నీకి పడే ఓట్లు కూడా చీలిపోవచ్చు. అంటే సన్నీకి ఏడెనిమిది వేసి మిగతావాటిని మానస్‌, కాజల్‌కు వేసే అవకాశం ఉంది. ఒకవేళ సిరిని బయటకు పంపితే మాత్రం షణ్ముఖ్‌కు మరింత ప్లస్‌ అవుతుంది. ఇప్పటికే సిరి వల్ల ఇమేజ్‌ డ్యామేజ్‌ అవుతుండటంతో ఆమె బయటకు వస్తే నెగెటివిటీ తగ్గేందుకు ఆస్కారం ఉంది. మరి బిగ్‌బాస్‌ హౌస్‌కు ఈవారం ఎవరు టాటా చెప్తారో చూడాలి మరి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all

Video

View all
 
Advertisement