అమెజాన్‌ ప్రైమ్‌లో దూసుకెళ్తున్న ‘క్షీరసాగర మథనం’ | Ksheera Sagara Madhanam Movie Creates Record In Amazon prime Video | Sakshi
Sakshi News home page

అమెజాన్‌ ప్రైమ్‌లో దూసుకెళ్తున్న మానస్‌ ‘క్షీరసాగర మథనం’

Published Tue, Sep 14 2021 4:33 PM | Last Updated on Tue, Sep 14 2021 4:34 PM

Ksheera Sagara Madhanam Movie Creates Record In Amazon prime Video - Sakshi

‘బిగ్ బాస్‌’ఫేమ్ మానస్, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా అనిల్ పంగులూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘క్షీరసాగర మథనం’.అక్షత సోనావని ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. శ్రీ వెంకటేశ్వర పిక్చర్స్‌, కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా మూవీని నిర్మించాయి. ఆగస్టు 6న థియేటర్స్ లో విడుదలై... కరోనా కారణంగా పరిమిత ఆదరణ పొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రముఖ ఓటీటీ ‘అమెజాన్‌ ఫ్రైమ్‌’లో విడుదలై... సంచలనం సృష్టిస్తూ ట్రేడ్ వర్గాలను విస్మయపరుస్తోంది. అమెజాన్‌ ప్రైమ్‌లో 499వ చిత్రంగా విడుదలైన ఈ చిత్రం నాని ‘టక్‌ జగదీష్‌’ తార్వాత రెండో స్థానంలో నిలవడం గర్వంగా ఉందని దర్శకుడు అనిల్‌ పంగులూరి పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement