Bigg Boss 5 Telugu Grand Finale Highlights: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌లో సిరి ఎలిమినేట్ అవడంతో నలుగురు మాత్రమే మిగిలారు. సన్నీ, శ్రీరామ్, మానస్, షణ్ముఖ్ టైటిల్ బరిలో నిలిచారు. వీరిలో ఒకరిని ఎలిమినేట్ చేసేందుకు శ్యామ్ సింగరాయ్ టీమ్ నుంచి నాని, సాయిపల్లవి, కృతీ శెట్టి హౌస్‌లో అడుగుపెట్టారు. మీ నలుగురిలో ఒకరే గెలుస్తారు, కాబట్టి గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయనుకున్నవారు డబ్బులు తీసుకుని ఎలిమినేట్ కావచ్చని నాని ఆఫర్ ఇచ్చాడు.
సూట్‌కేసులో ఎంతుందో చెప్పను కానీ భారీ మొత్తమే ఉంటుందని ఫైనలిస్టులను టెంప్ట్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ ఎవరూ ఆ డబ్బు తీసుకోవడానికి ముందుకు రాలేదు. దీంతో మానస్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. ఇప్పుడు ఓడిపోయావంటే ఇంకోసారి గెలుస్తావనే అంటూ మానస్‌లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు సాయిపల్లవి, కృతీశెట్టి. ఇక స్టేజీపైకి వచ్చిన మానస్ ఈ బిగ్‌బాస్ హౌస్‌లో హౌస్‌మేట్స్ హృదయాలను గెల్చుకున్నానన్నాడు. ఎవరు గెలవాలన్న నాగ్ ప్రశ్నకు సన్నీలో గెలవాలన్న ఫైర్ ఉందని, అతడే విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment