
Bigg Boss 5 Telugu Promo, Maanas Is New Captain!: గత ఆదివారం యాంకర్ రవి అందరి ముందు తనది బ్యాడ్ బిహేవియర్ అంటూ మాట్లాడటం తట్టుకోలేకపోయాడు సన్నీ. అందుకే అతడు ఏం చేసినా, ఏం మాట్లాడినా తీసుకోలేకపోతున్నాడు. ఎప్పటిలా సరదాగా ఉండలేకపోతున్నాడు. తాజాగా అతడు సంచాలకుడిగా ఉన్న గేమ్‌లోనూ కొట్లాటకు దిగాడు. అయితే రవి.. ఈ దూరాన్ని తగ్గిద్దామనుకున్నాడో? మరింకేదో కానీ తనకు వచ్చిన పవర్‌ను సన్నీకి త్యాగం చేయడానికి రెడీ అయ్యాడు. అదేమాట బిగ్‌బాస్‌కు చెప్పాడు.
కానీ సన్నీ మాత్రం అతడిస్తానంటున్న పవర్‌ను తీసుకోవడానికి రెడీగా లేనని తేల్చి చెప్పాడు. దీంతో హౌస్‌మేట్స్ అతడికి నచ్చజెప్పేందుకు ఎంతగానో ప్రయత్నించగా చివరాఖరకు అయిష్టంగానే సరేనంటూ తలూపాడు. ఆ పవర్ ద్వారా సన్నీ తదుపరి సైరన్ వచ్చినప్పుడు ఒకరిని తొలగించి వారి స్థానంలో మైన్‌లో దిగి బంగారం వెతికే అవకాశాన్ని కొట్టేశాడు. ఇదిలా ఉంటే కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌తో పాటు కెప్టెన్సీ టాస్క్ కూడా ముగిసిందని, మానస్ కొత్త కెప్టెన్‌గా అవతరించాడని లీకువీరులు సోషల్ మీడియాలో చాటింపు చేశారు. మానస్ తొలిసారి కెప్టెన్ అయినందుకు కొందరు నెటిజన్లు సంతోషిస్తూనే మరోపక్క సన్నీ బాధతో కుమిలిపోతున్నాడని విచారం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment