
నీ చుట్టూ ఉన్నవాళ్లను వాడుకుని ఆడుతున్నావెందుకని నాగ్ ప్రశ్నించగా ఈ హౌస్‌లో ఉంది వాడుకోవడానికే కదా అని ఆన్సరిచ్చాడు రవి. ప్రియాంకతో నీ ఫ్యూచర్ రిలేషన్ ఏంటని ప్రశ్నించగా..
Bigg Boss Telugu 5 Promo: సండే ఫండే మాత్రమే కాదు ఎలిమినేషన్ డే కూడా అంటున్నాడు హోస్ట్ నాగార్జున. ఎప్పటిలాగే హౌస్‌మేట్స్‌తో వినోదాత్మకమైన గేమ్స్ ఆడించి చివర్లో ఒకరిని ఎలిమినేట్ చేయడానికి రెడీ అయిపోయాడు. తాజా ప్రోమోను చూస్తుంటే నాగ్.. కంటెస్టెంట్లతో ఆసక్తికర గేమ్ ఆడించినట్లు కనిపిస్తోంది. కంటెస్టెంట్లు ఇతర ఇంటిసభ్యులను అడగాలనుకున్న ప్రశ్నలను పేపర్ మీద రాసివ్వగా నాగ్ వాటిని అడుగుతున్నాడు.
ఫిజికల్ టాస్క్ అనగానే సన్నీ సైడ్ చూస్తావు, తను మరీ అంత వైల్డా? అని షణ్నును క్వశ్చన్ చేయగా అతడు ఫక్కుమని నవ్వేశాడు. ఇక మానస్‌ను.. ప్రియాంకతో నీ ఫ్యూచర్ రిలేషన్ ఏంటని ప్రశ్నించగా దానికతడు తడుముకోకుండా ఫ్రెండ్‌షిప్ అని బదులిచ్చాడు. మానస్ నుంచి ఏం ఆశిస్తున్నావని ప్రియాంకను అడగ్గా ముందు ఈ తిక్క ప్రశ్న ఎవరడిగారని ఆరా తీసింది. దీంతో నాగ్.. మానసే అడిగాడు అని చెప్పడంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు.
యానీ మాస్టర్‌ను.. మీ బుర్రను వంంట చేసేటప్పుడు, రెడీ అయ్యేటప్పుడు మాత్రమే వాడతారా? అని అడగడంతో ఆమె నోరెళ్లబెట్టింది. దీనికి యానీ.. అలా ఏం లేదని ఆన్సరిచ్చింది. నీ చుట్టూ ఉన్నవాళ్లను వాడుకుని ఆడుతున్నావెందుకని నాగ్ ప్రశ్నించగా ఈ హౌస్‌లో ఉంది వాడుకోవడానికే కదా అని ఆన్సరిచ్చాడు రవి.