
బుల్లితెర హిట్ షో బిగ్‌బాస్ తెలుగులో నాలుగు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈసారి ఐదు రెట్ల ఫన్, ఐదు వంతుల ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ అంటూ ఐదో సీజన్‌తో మన ముందుకొచ్చాడు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున. అయితే షో ప్రారంభంలోనే 19 మంది కంటెస్టెంట్లను హౌస్‌లోకి పంపించాడు బిగ్‌బాస్. తొలి రోజే వారితో టాస్క్‌లు ఆడించిన బిగ్‌బాస్ నేడు మరిన్ని టాస్క్‌లు ఆడించనున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో తొలిసారి కంటెస్టెంట్లకు పవర్ రూమ్‌ను పరిచయం చేశాడు. అందులో అడుగు పెట్టాలంటే తను పెట్టే టాస్క్‌లో విజయం సాధించాలని మెలిక పెట్టాడు. ఇందులో విశ్వ గెలవడంతో అతడు పవర్ యాక్సెస్ పొందాడు.
అయితే మరో కంటెస్టెంట్‌కు కూడా పవర్ ఇచ్చేందుకు బిగ్‌బాస్ రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు స్లీపింగ్ టాస్క్ ఇచ్చాడని, ఇందులో మానస్ గెలుపొందాడని ఓ వార్త లీకైంది. ఇదే కనక నిజమైతే ఈ విజయం అతడికి వరంగా మారనుంది. నామినేషన్‌లో ఉన్న అతడిని ఎలిమినేషన్ నుంచి గట్టెక్కించే అవకాశముంది. కాగా సైలెంట్‌గా, పట్టింపు లేనట్లు ఉన్నాడు, అందరితో కలవట్లేదంటూ తోటి కంటెస్టెంట్లు మానస్‌ను తొలివారమే నామినేట్ చేసిన విషయం తెలిసిందే. తనకు గానీ పవర్ యాక్సెస్ వస్తే వారందరికీ ఈ విజయంతో గట్టి సమాధానం చెప్పినవాడవుతాడు. అంతేకాదు, ఆ పవర్‌ను మానస్ తనకు అనుకూలంగా ఎలా ఉపయోగించుకుంటాడనేది కూడా ఆసక్తికరంగా మారింది.