
బిగ్‌బాస్ షోలో పాల్గొనే అవకాశం రావడం ఒకెత్తైతే ఇక్కడ వాళ్లేంటో ప్రూవ్ చేసుకోవడం మరో ఎత్తు. ఇక్కడ వారి ప్రవర్తనను ఒక్కటే పరిశీలనలోకి తీసుకోరు ప్రేక్షకులు. టాస్కుల్లో ఆటతీరు, మిగతా ఇంటిసభ్యులతో వారి ప్రవర్తన.. ఇలా అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్నాకే ఓట్లు వేస్తుంటారు. ఇక ఈ వారం నటరాజ్ మాస్టర్, యానీ మాస్టర్, లోబో, యాంకర్ రవి, ప్రియ, కాజల్, సిరి హన్మంత్, సన్నీ నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో సన్నీ కెప్టెన్సీ కోసం పోటీపడుతున్నాడు. శ్వేత, శ్రీరామ్, సన్నీ కెప్టెన్సీ పోటీదారులుగా నిలబడగా వీరిలో ఒకరిని కెప్టెన్‌గా ఎన్నుకోమని బిగ్‌బాస్ ఆదేశించాడు.
దీంతో ప్రియ, లోబో, నటరాజ్ మాస్టర్, షణ్ముఖ్, సిరి సహా పలువురు సన్నీ కెప్టెన్ కాకూడదని అతడిని కత్తులతో పొడిచారు. త్వరగా ఆవేశపడతావని ప్రియాంక సింగ్ కత్తితో పొడవగా నా ఆవేశం ఇంకా చూడలేదని ఆన్సరిచ్చాడు సన్నీ. ఛాన్స్ రాగానే సన్నీని కత్తులతో కసాకసా పొడిచేద్దామనుకున్నానంది కాజల్. కానీ అప్పటికే ఎన్నో కత్తులు అతడి నడుముకు కట్టిన బెల్టుకు పొడిచి ఉండటంతో తటపటాయించింది. అయితే లోబో తనకు మద్దతివ్వకుండా ఇలా నేరుగా పొడుస్తాడని ఊహించలేదని సన్నీ మానస్ దగ్గర తన బాధను వ్యక్తం చేశాడు. కొందరు ఆడుతున్న సింపథీ గేమ్ ఇవాళ కాకపోయినా రేపైనా తెలుస్తుందని చెప్పుకొచ్చాడు. హౌస్‌లో ఇంతమంది తనకు వ్యతిరేకంగా ఉన్నారని తెలిసి తట్టుకోలేకపోయాడు సన్నీ. దీంతో మానస్ అతడిని ఓదార్చుతూ.. టాస్కులో ఓడిపోవడం విషయం పక్కన పెడితే ఎవరేంటో తెలిసే అవకాశం వచ్చింది కదా అని ధైర్యం చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment