
Bigg Boss Telugu 5 Promo: ఎప్పుడూ ఒకరినొకరు తిట్టుకుంటూ ఫైటింగ్ చేసే కంటెస్టెంట్లు నేడు మాత్రం ప్రేక్షకులకు పూర్తిస్థాయిలో వినోదాన్ని పంచేందుకు రెడీ అయినట్లు కనిపిస్తోంది. ఇంటిసభ్యులందరూ వారికి నచ్చిన సూపర్ స్టార్‌లా వ్యవహరించాల్సి ఉంటుందని ఆదేశించాడు బిగ్‌బాస్. ప్రస్తుతం హౌస్‌లో ఉన్నవారిలో దాదాపు అందరూ నటీనటులే కావడంతో ఈ టాస్క్ చేయడం వారికి ఈజీ అయింది. టాస్క్‌లో భాగంగా సన్నీ బాలయ్య గెటప్ వేయగా సిరి జెనీలియా, కాజల్ శ్రీదేవి, మానస్ పవన్ కల్యాణ్, శ్రీరామ్ చిరంజీవి, షణ్ముఖ్ సూర్య గెటప్‌లు వేశారు. అంతేకాదు ఆ స్టార్ నటుల ఫేమస్ క్యారెక్టర్లను కళ్ల ముందుంచుతూ అలరించారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు వీరాభిమాని అయిన మానస్ దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా డ్యాన్స్‌తో రఫ్ఫాడించేశాడు. ఈ ప్రోమో చూసిన కొందరు నెటిజన్లు మానస్ హుషారు చూసి అవాక్కవుతున్నారు. పింకీ వెళ్లిపోయాక గాలికి వదిలేసిన పక్షిలా హాయిగా ఎగురుతున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ టాస్కులో కాజల్ గెలిచి ప్రేక్షకులను నేరుగా ఓట్లడిగే అవకాశాన్ని గెలుచుకున్నట్లు సమాచారం!
Comments
Please login to add a commentAdd a comment