తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గం అన్నా డీఎంకే చీఫ్ శశికళపై ముప్పేటదాడిని ముమ్మరం చేసింది. శశికళ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునేందుకు, పోయెస్ గార్డెన్ నుంచి ఆమెను వెళ్లగొట్టేందుకు పన్నీరు సెల్వం ఎవరూ ఊహించని విధంగా ఎత్తుకు పైఎత్తులు వేస్తుండగా, అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి కూడా ఆమెను తొలగించేందుకు ప్రయత్నాలను వేగవంతం చేశారు.