చక్రాయపేట : తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచ పచ్చచొక్క నాయకులు అధికారులపై దాడి చేసి భయోందోళన సృష్టిస్తున్నారు. వివరాల్లోకి వెళ్లితే మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో విధి నిర్వహణలో ఉన్న వ్యవసాయ శాఖ అధికారి మధుసుధన్‌పై తెలుగుదేశం పార్టీకి చెందిన సురభి సర్పంచ్ భర్త, అనుచరులతో వెళ్లి వ్యవసాయశాఖ అధికారిపై పురుష పదా జాలాతో చేయ్యి చేసుకొన్నారు. గురువారం ఎంపీడీఓ కార్యాలయంలో వ్యవసాయశాఖ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న వ్యవసాయ శాఖ అధికారిని తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు పంట నష్టపోయిన పరిహారం వచ్చేందుకు తను సూచించిన పేర్లు మాత్రమే పొందుపరచాలని డిమాండ్ చేశారు. వెంటనే వ్యవసాయశాఖ అధికారి, సిబ్బంది గ్రామాలలో వెళ్లి పంట సాగు చేసిన రైతుల పొలాల్లోకి వెళ్లి పంట నష్టాన్ని నమోదు చేశామని తెలిపారు. అవన్ని తమ అవసరం లేదని, అవన్నీ తొలగించి తాము సూచించిన వారికి మాత్రమే పంట సాగు చేయకపోయిన తన అనచరులకు నష్ట పరిహారం వచ్చే విధంగా చేయాలని, ప్రభుత్వం తమదేనంటూ నేను సూచించిన పేర్లు నమోదు చేయకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని వ్యవసాయ అధికారికి హెచ్చరించారు. అనంతరం వ్వవసాయశాఖ అధికారి చట్టంప్రకారం నడుచుకొంటామని పంట సాగు చేసిన వారి పేర్లు నమోదు చేశామని, మీరు ఇలా దౌర్జన్యం చేయడం మంచిది కాదని వ్యవసాయ శాఖ అధికారి తెలిపారు.