అంబర్‌పేట: తల్లిదండ్రులు బైకు కొనివ్వలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసకున్న సంఘటన గురువారం రాత్రి అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం అంబర్‌పేట రఘునాథ్‌నగర్‌కు చెందిన యాదయ్య కుమారుడు మదుసూదన్ (25) ఈ నెల 14 న బైకు కావాలని తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. ఇంట్లో ఖాళీగా ఉంటూ తిరిగే నీకు బైకెందుకంటూ వారు నిరాకరించడంతో మనస్తాపం చెందిన అతను గదిలోకి వెళ్లి ఉరేసుకున్నాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.