దుగ్గొండి/ వరంగల్ : బైక్ కొనివ్వలేదని డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓరుగంటి సదానందం– మంజుల దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు నాగవెంకట్(19) వరంగల్‌లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుండగా, బైక్ కొనివ్వాలని కొద్ది రోజులుగా అడుగుతున్నాడు. దీంతో పంట అమ్మిన తర్వాత కొనిస్తామని వారు చెప్పారు.
ఈ క్రమంలో బైక్ కొనివ్వలేదని అలిగిన నాగవెంకట్ ఈనెల 27న ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగాడు. పొలం నుంచి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు చూసి ప్రశ్నించడంతో గడ్డి మందు తాగిన విషయం చెప్పాడు. వెంటనే నర్సంపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడి తండ్రి సదానందం ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికిరణ్ తెలిపారు.
చదవండి : (‘మా కూతురి ఆచూకీ తెలపండి’)
(పెళ్లై మూడు నెలలు.. స్నేహితుడితో వెళ్లి)
Comments
Please login to add a commentAdd a comment