
ప్రతీకాత్మక చిత్రం
పశ్చిమగోదావరి జిల్లా : కుక్కునూరు మండలం రావికుంట గ్రామంలో ఓ మహిళ తన ఇద్దరు బిడ్డలతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పూనుకుంది. గ్రామానికి చెందిన కృష్ణకుమారి సోమవారం తన భర్తతో బైక్ విషయంలో గొడవపడింది. భర్త తన మాట వినకపోవడంతో మనస్తాపంతో పురుగుల మందు తన పిల్లలకు తాగించి తర్వాత తానూ తాగింది.
అప్రమత్తమైన స్థానికులు తల్లి సోమరాజు కృష్ణ కుమారి(25)తో పాటు ఆమె ఇద్దరు పిల్లలు రుతిక్(2), స్వప్నిక(3)లను దగ్గరలోని వేలేరుపాడు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.